Bigg Boss 3: శ్రీముఖి ఫ్లయింగ్ కిస్.. అలీ కన్నీళ్లు!

By AN TeluguFirst Published Oct 31, 2019, 11:40 PM IST
Highlights

ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా శ్రీముఖి ని పిలిచి స్పెషల్ గా రూపొందించిన వీడియో ప్లే చేసి చూపించారు. దానికి ముందు బిగ్ బాస్ శ్రీముఖిని తన ఆట విషయంలో కొనియాడారు

బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకి చేరుకోనుంది. పదిహేడు మంది కంటెస్టంట్స్ తో ఈ షో మొదలుకాగా ఫైనల్స్ కి ఐదుగురు చేరుకున్నారు. వీరిలో శ్రీముఖి, రాహుల్ ల మధ్య ఓటింగ్ విషయంలో పోటీ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు విజేతగా నిలవనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. హౌస్ లో వారివంద రోజుల జర్నీని వీడియోగా రూపొందించి ప్లే చేశారు. ముందుగా వరుణ్, ఆ తరువాత రాహుల్, బాబా భాస్కర్ ల వీడియోలు ప్లే చేసి చూపించారు.

ఇక్కడి వరకు వచ్చాడంటే అదే కారణం.. రాహుల్ తల్లి ఎమోషనల్!

ఇక ఈరోజు ఎపిసోడ్ లో ముందుగా శ్రీముఖి ని పిలిచి స్పెషల్ గా రూపొందించిన వీడియో ప్లే చేసి చూపించారు. దానికి ముందు బిగ్ బాస్ శ్రీముఖిని తన ఆట విషయంలో కొనియాడారు. ఆ తరువాత వీడియో చూసిన శ్రీముఖి 'బిగ్ బాస్ మీకు హ్యాట్సాఫ్' అంటూ ఎమోషనల్ అయింది. ఇలాంటి ఫీలింగ్ లో లైఫ్ లో ఎప్పుడు రాలేదని, ఇకపై రాదనీ.. తన లైఫ్ లో ఇది బెస్ట్ మూమెంట్ అని చెబుతూ బిగ్ బాస్ కి లవ్యూ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది.

ఆ తరువాత అలీ రెజాకి తన జర్నీ వీడియో ప్లే చేసి చూపించగా.. అలీ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. మోకాలి మీద కూర్చొని బిగ్ బాస్ కి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాడు. దీని తరువాత హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

హౌస్ లో ఉన్న వస్తువులను ఉపయోగించి బిగ్ బాస్ గురించి, హౌస్ గురించి మూడు యాడ్స్ చేయాలని చెప్పారు. యాక్షన్, కామెడీ, డ్రామా ఇలా మూడు జోనర్స్ లో యాడ్స్ ఉండాలని చెప్పారు. ఈ క్రమంలో హౌస్ మేట్స్ అందరూ కలిసి రకరకాల యాడ్స్ చేసి తమ నటనతో నవ్వించారు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ రానున్నారు. 

click me!