Bigg Boss 3: రూ.25 లక్షల ఆఫర్ కాదని ఎలిమినేట్ అయిన బాబా!

Published : Nov 03, 2019, 08:58 PM ISTUpdated : Nov 03, 2019, 09:30 PM IST
Bigg Boss 3: రూ.25 లక్షల ఆఫర్ కాదని ఎలిమినేట్ అయిన బాబా!

సారాంశం

ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ తమ డాన్స్ లతో షోని మొదలుపెట్టారు  

బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్
అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు.

హోస్ట్ నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అనంతరం ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ తో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడిన నాగార్జున మన టీవీ ద్వారా ఐదుగురు ఫైనలిస్ట్ లతో మాట్లాడారు. రాహుల్ ఓ పాట పాడాడు. ఆ తరువాత కేథరిన్ త్రెసా తన పెర్ఫార్మన్స్ తో స్టేజ్ ని షేక్ చేసింది.

Bigg Boss3: బంపర్ ఆఫర్ వదిలేసి దెబ్బై పోయాడు.. వరుణ్ అవుట్!

ఆ తరువాత డైరెక్టర్ మారుతి, రాశిఖన్నా కలిసి హౌస్ లోకి వెళ్లి అలీ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. ఆ తరువాత హౌస్ లోకి వెళ్లిన శ్రీకాంత్, కేథరిన్ త్రెసా.. వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. ఫైనల్ గా హౌస్ లో టాప్ 3 కంటెస్టంట్స్ శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ లు ఉన్నారు. వీరిలో ఒకరిని బయటకి తీసుకురావడానికి హౌస్ లోకి నటి అంజలిని పంపించారు నాగార్జున.

అలా అంజలి హౌస్ లోకి వెళ్లిన తరువాత నాగార్జున మరోసారి పదిలక్షల ఆఫర్ ఇచ్చారు. కానీ హౌస్ లో ఉన్న ముగ్గురు దానికి అంగీకరించలేదు. ఆ తరువాత రూ.25 లక్షల ఆఫర్ ఇచ్చారు. కానీ దానికి కూడా అంగీకరింలేదు. దీంతో వారి కుటుంబసభ్యులను అడిగారు. వారు కూడా దానికి అంగీకరించలేదు.

దీంతో ఆ ఆఫర్ కాస్త వృధా అయింది. దీంతో అంజలి ఎలిమినేటెడ్ కంటెస్టంట్ ని అనౌన్స్ చేస్తూ హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టింది. చివరగా.. బాబా భాస్కర్ పేరు అనౌన్స్ చేస్తూ అతడిని బయటకి తీసుకెళ్లింది.  


 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?