Bigg Boss 3: హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టిన రాశి.. అలీ అవుట్!

By AN TeluguFirst Published Nov 3, 2019, 7:25 PM IST
Highlights

ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ తమ డాన్స్ లతో షోని మొదలుపెట్టారు
 

బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది.

భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్ అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు. హోస్ట్ నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అనంతరం ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ తో టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీస్ తో మాట్లాడిన నాగార్జున మన టీవీ ద్వారా ఐదుగురు ఫైనలిస్ట్ లతో మాట్లాడారు.

Bigg Boss 3: శ్రీముఖి నోరేసుకొని పడిపోతుంది.. మారుతి కామెంట్స్!

రాహుల్ ఓ పాట పాడాడు. ఆ తరువాత కేథరిన్ త్రెసా తన పెర్ఫార్మన్స్ తో స్టేజ్ ని షేక్ చేసింది. ఇక హౌస్ లో ఉన్న ఐదుగురిలో ముందుగా ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే చెప్పడానికి డైరెక్టర్ మారుతి, హీరోయిన్ రాశిఖన్నాలను తీసుకొచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన మారుతి టాప్ 5 కంటెస్టంట్స్ గురించి మాట్లాడారు.

ఆ తరువాత హౌస్ లోకి వెళ్లిన మారుతి, రాశిఖన్నా హౌస్ మేట్స్ తో కలిసి డాన్స్ చేశారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి అలీని హౌస్ నుండి బయటకి తీసుకొచ్చారు. అలీని అనౌన్స్ చేసే ప్రాసెస్ లో రాశిఖన్నా హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టింది. 

ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన మారుతి, అలీ, రాశిలతో నాగార్జున మాట్లాడారు. ఇంత స్వీట్ పెర్సన్ ని బయటకి తీసుకురావడం బాధగా ఉందని అలీ చెప్పగా.. ఓ దేవత వచ్చి నన్ను బయటకి తీసుకువచ్చిందని రాశిఖన్నాని ఉద్దేశిస్తూ అన్నారు. 

click me!