కంటెస్టంట్ ని చెప్పు తీసుకొని కొట్టింది!

Published : Jan 07, 2020, 12:49 PM ISTUpdated : Jan 07, 2020, 01:02 PM IST
కంటెస్టంట్ ని చెప్పు తీసుకొని కొట్టింది!

సారాంశం

ఈసారి ఏకంగా ఓ కంటెస్టంట్ తన తోటి కంటెస్టంట్ ని చెప్పు తీసుకొని మరీ కొట్టింది. గతంలో కొన్నిరోజుల పాటు ఎంతో సన్నిహితంగా మెలిగిన విశాల్ ఆదిత్య, మధురిమా తులిలకు ఇప్పుడు అసలు పడడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. 

బిగ్ బాస్ హిందీ సీజన్ 13 గొడవలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఈ షోలో తరచూ ఏదొక వివాదం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వారంతంలో వారి తగాదాలను పరిష్కరించడంతోనే సరిపోతుంది.

ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న బిగ్ బాస్ షోలోని నిన్నటి ఎపిసోడ్ లో ఇద్దరి కంటెస్టంట్స్ మధ్య గొడవ జరిగింది. ఈసారి ఏకంగా ఓ కంటెస్టంట్ తన తోటి కంటెస్టంట్ ని చెప్పు తీసుకొని మరీ కొట్టింది. గతంలో కొన్నిరోజుల పాటు ఎంతో సన్నిహితంగా మెలిగిన విశాల్ ఆదిత్య, మధురిమా తులిలకు ఇప్పుడు అసలు పడడం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

పవన్ ఫ్యాన్స్ ని మరోసారి కెలికేసిన అల్లు అర్జున్!

ఈ క్రమంలో గార్డెన్ ఏరియాలో ఉన్న వీరిద్దరూ గొడవ పడ్డారు. విశాల్ కోపంతో మధురిమని నోటికొచ్చినట్లు తిట్టాడు. అక్కడ నుండి వెళ్లిపోమంటూ ఆమెని తిట్టిపోశాడు. దీంతో ఆవేశపడ్డ మధురిమ.. విశాల్ ని చెప్పుతో కొట్టింది. ఆ తరువాత అతడిని తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది. ఈ ఘటనపై సీరియస్ అయిన బిగ్ బాస్ ఇద్దరినీ కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ప్రశ్నించాడు.

ముందుగా విశాల్.. శారీరక హింసకి పాల్పడేవాళ్లను ఇంట్లోకి అనుమతిస్తారా..? అని ప్రశ్నించాడు. మధురిమతో కలిసి తాను ఈ ఇంట్లో ఉండలేనని తేల్చి చెప్పాడు. ఆ తరువాత మధురిమ చెప్పుతో కొట్టడం తప్పేనని విశాల్ కి క్షమాపణలు చెప్పింది. కానీ ఈ గొడవలో అతడి తప్పు కూడా ఉండడంతో బిగ్ బాస్ ఇద్దరినీ మందలించారు. శారీరక హింసకి పాల్పడినందుకు మధురిమని రెండు వారాల పాటు నేరుగా నామినేట్ చేశారు బిగ్ బాస్.   

 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?