
పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన అభిమానులకు అసలైన ట్రీట్ రెడీ అయ్యింది. ఇంత కాలం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే అనేక సందిగ్ధాల మధ్య Bheemla Nayak రిలీజ్ డేట్ ఎప్పుడు అనే సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో రిలీజ్ డేట్‌ని కన్ఫమ్ చేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఫిబ్రవరి 25నే `భీమ్లానాయక్`(Bheemla Nayak) సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 25నే వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు. కానీ సడెన్‌గా రిలీజ్ డేట్‌ని ఖరారు చేయడంతో హంగామాకి పవన్ అభిమానులు సిద్ధమవుతుంది.
`భీమ్లానాయక్` సినిమా ట్రైలర్ ఎప్పుడు రాబోతుందని అంతా వెయిట్ చేస్తున్న తరుణంలో రెండు, మూడు రోజుల నుంచి నేడో, రేపో అంటూ సమచారం అందుతూ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ ట్రైలర్ పై ఇంకా ఆసక్తి పెరిగింది. మరోవైపు ఈ రోజు `భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఈవెంట్ లోనే ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారనేది స్పష్టం అవుతోంది. ఈరోజు రాత్రి 8:10 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు భీమ్లా నాయక్ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్ మెంట్’ తాజా అప్డేట్ ను అందించింది.
‘పవర్ తుఫానుకు సిద్ధంగా ఉండండి’ అంటూ మేకర్స్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు. దీంతో అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. భీమ్లా నాయక్ ఈవెంట్ కు ఛీప్ గెస్ట్ గా హాజరవుతున్న మంత్రి కేటీఆర్ (KTR) చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను విడుదల చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
`భీమ్లా నాయక్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ గెస్ట్ గా వస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. దీంతో ఆ సమయంలోనే ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు స్పష్టం అవుతోంది. దీంతో ఫ్యాన్స్ సంబరాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పవన్, రానా కలిసి నటిస్తున్న `భీమ్లా నాయక్` చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, కథనం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్‌కి జోడిగా నిత్యా మీనన్, రానాకి జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.