పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీపై బండ్ల గణేష్ రివ్యూ

By tirumala ANFirst Published Apr 14, 2020, 2:43 PM IST
Highlights
పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు.. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా పూనకంతో ఊగిపోతాడు. తాజాగా బండ్ల గణేష్ పవన్ పై మరోసారి తన అభిమానం చాటుకున్నాడు.
పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు.. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న బండ్ల గణేష్ ఒక్కసారిగా పూనకంతో ఊగిపోతాడు. తాజాగా బండ్ల గణేష్ పవన్ పై మరోసారి తన అభిమానం చాటుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బంద కలసి నటించిన చిత్రం తీన్ మార్. 

ఈ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాత. తీన్ మార్ చిత్రం విడుదలై నేటితో 9 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తీన్ మార్  చేసుకుంటూ పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతే కాదు తీన్ మార్ చిత్రంపై బండ్ల గణేష్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. 

టాలీవుడ్ మోస్ట్ వాంటెండ్ కమెడియన్.. అఖిల్ నుంచి చిరంజీవి వరకు..

తీన్ మార్ మూవీ నా జీవితంలో ప్రత్యేకమైనది. ఈ చిత్రం విజయం సాధించకపోయినప్పటికీ నిర్మాణం పరంగా ఈ చిత్రం నాకు మంచి అనుభూతిని మిగిల్చింది. ఈ చిత్రాన్ని కాశీ, మైసూర్, అమెరికా, సౌత్ ఆఫ్రికా, థాయ్ ల్యాండ్ లాంటి అద్భుతమైన ప్రాంతాల్లో చిత్రీకరించాం. ఈ చిత్రంలో హృదయాన్ని హత్తుకునే డైలాగులు ఉన్నాయి. మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. 

అర్జున్ పాల్వాయిగా, మైఖేల్ వేలాయుధంగా మా బాస్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి అద్భుతమైన డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు అని బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేశాడు. 
 

తీన్ మార్ చిత్రం నా జీవితంలో ఓ ప్రత్యేకమైన చిత్రం విజయం సాధించి పోయినప్పటికీ చిత్ర నిర్మాణం నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది⁦⁩ ⁦⁩ pic.twitter.com/lnQxDJD8Ed

— BANDLA GANESH (@ganeshbandla)

ఈ చిత్రాన్ని కాశీలో మైసూర్లో సౌతాఫ్రికాలో అమెరికాలో థాయిలాండ్ లో ఇంకా ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ లో నిర్మించడం జరిగింది⁦⁩ ⁦⁩ pic.twitter.com/pyCfZEsP9B

— BANDLA GANESH (@ganeshbandla)

ఈ చిత్రంలో హృదయానికి హత్తుకునే ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఉదాహరణకి అందంగా లేదని అమ్మని కోపంగా ఉన్నాడని నాన్నని వదలేవు కదా

— BANDLA GANESH (@ganeshbandla)

అర్జున్ పాల్వాయ్ గా మైకేల్ వేలాయుధమూ గా మా బాస్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు

— BANDLA GANESH (@ganeshbandla)
click me!