
యువరత్న సినిమాలో నటించిన కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ (puneeth raj kumar) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి బెంగళూరు (bangalore) విక్రమ్ ఆసుపత్రి (vikram hospital) ఐసీయూలో ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. జిమ్‌లో వర్కవుట్లు చేస్తుండగా నిన్న ఒక్కసారిగా ఆయన గుండెపోటుకు (heart stroke) గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ మూడవ కుమారుడే పునీత్ రాజ్ కుమార్. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆసుపత్రికి వద్దకు చేరుకుని పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించారు