సీనియర్ హీరోలు కూడా సరికొత్త గెటప్పులతో అభిమానులకు మంచి కిక్కిస్తున్నారు. నేటితరం యువ హీరోలకంటే హై స్పీడ్ లో సినిమాలను చేస్తున్న బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ఈ మధ్య సీనియర్ హీరోలు కూడా సరికొత్త గెటప్పులతో అభిమానులకు మంచి కిక్కిస్తున్నారు. నేటితరం యువ హీరోలకంటే హై స్పీడ్ లో సినిమాలను చేస్తున్న బాలయ్య బాబు ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు - మహానాయకుడు సినిమాలతో పాటు రీసెంట్ గా వచ్చిన రూలర్ కూడా ప్లాప్ కావడంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
అయితే తాజాగా బాలయ్య నెక్స్ట్ సినిమా కోసం గుండుతో రెడీ అయ్యాడు. అదే లుక్కుతో అభిమానులకు దర్శనమిచ్చి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజైన మరికొన్ని ఫొటోల్లో కూడా బాలయ్య మరీంత చేంజ్ అయినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కోసం రకరకాలు గెటప్స్ వేసిన బాలయ్య.. ‘రూలర్’ సినిమాలో ఐరన్ మ్యాన్ లుక్లో కనిపించి ఫ్యాన్స్ కు పండగ చేసాడు.
ఈ ఫోటలో గుండు చేయించుకుని, మీసాలు పెంచి, వైట్ అండ్ వైట్ డ్రస్ లో చిరు నవ్వు చిందిస్తున్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించే చిత్రం కోసం ఇలా రెడీ అయ్యాడని చర్చ మొదలెట్టారు. సోషల్ మీడియాలో.. ‘పాత్ర కోసం బాలయ్య ఏదైనా చేస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం, ఇది కదా మేం కోరుకుంది, ఈ లుక్లో అదరగొడుతున్నార’ని కామెంట్స్ పెడుతున్నారు.
రూటు మార్చిన హీరోలు.. హిట్టు కొట్టేలా ఉన్నారు!
మొదటసారి బాలయ్య ఇలా జుత్తు లేకుండా దర్శనమివ్వడంతో అభిమానులు ఆనందం,ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. అయితే, నిజానికి ఇది బాలయ్య ఓ కార్యక్రమానికి హాజరుకాగా అక్కడ దిగిన ఫోటో. మరి ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు బోయపాటి చిత్రం కోసం ఇలా తన లుక్ మార్చాడా, పర్శనల్ గా కొత్త లుక్ ప్రయత్నించారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ కొత్త లుక్లో బాలయ్య అందరిని ఆశ్చర్యపరుస్తు