బాలయ్య, బోయపాటి మూవీ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్!

By tirumala ANFirst Published Dec 5, 2019, 8:11 PM IST
Highlights

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నటిస్తున్న చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత నటిస్తున్న చిత్రం రూలర్. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆలోపే బాలయ్య తన అభిమానులని సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది సూపర్ హిట్ కాంబినేషన్. 

వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ప్రస్తుతం బాలయ్య, బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రానికి ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. 

రేపే(డిసెంబర్ 6, శుక్రవారం) ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. శుక్రవారం ఉందయం 9 గంటలకు బాలయ్య, బోయపాటి చిత్ర ప్రారంభోత్సవం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరు కానుండడం విశేషం. 

మిర్యాల రవీంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ ఫామ్ లో ఉన్న తమన్ ఈ మూవీకి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. 

click me!