పవన్ వాయిస్ ఓవర్ తోనే 'అశ్వద్ధామ'..కానీ కాదు

By Prashanth MFirst Published Jan 28, 2020, 6:19 PM IST
Highlights

పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాకు వాయిస్ ఇచ్చారంటే ఆ క్రేజే వేరు. అయితే ఆయన చాలా బిజీగా ఉంటారు. దానికి తోడు అందరూ ఆయన్ని రీచ్ కాలేరు. మరేం చేయాలి. నాగశౌర్య దానికో ఆలోచన చేసారు. పవన్ వాయిస్ ఓవర్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు తాజాగా ఇచ్చిన వాయిస్ ఓవర్ కాదు.

పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమాకు వాయిస్ ఇచ్చారంటే ఆ క్రేజే వేరు. అయితే ఆయన చాలా బిజీగా ఉంటారు. దానికి తోడు అందరూ ఆయన్ని రీచ్ కాలేరు. మరేం చేయాలి. నాగశౌర్య దానికో ఆలోచన చేసారు. పవన్ వాయిస్ ఓవర్ ఉంటుంది. కానీ అది ఇప్పుడు తాజాగా ఇచ్చిన వాయిస్ ఓవర్ కాదు. పవన్ అప్పట్లో నటించిన  'గోపాల గోపాల'  చిత్రంలో క్లిప్ ని వాడుతున్నారు.  ఈ విషయం స్వయంగా నాగశౌర్య మీడియాకు తెలియచేసారు.

నాగ శౌర్య మాట్లాడుతూ..సినిమా పవన్ కళ్యాణ్ వాయిస్ స్టార్ట్ అవుతుందని. దానికోసం 'గోపాల గోపాల' లో నుండి పవన్ కళ్యాణ్ క్లిప్ వాడుకున్నామని తెలిపాడు. అయితే ఆయన డైలాగ్ టైటిల్ కి క్లారిఫికేషన్ ఇస్తూ సినిమా పై ఆసక్తి నెలకొనేలా ఉంటుందని అన్నాడు. ఈ మేరకు నిర్మాత శరత్ మరార్ నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి ఫర్మిషన్ తీసుకున్నామని చెప్పారు. అలాగే తమ సినిమా నేరేషన్ రాక్షసుడుని పోలి ఉంటుందని అన్నారు.

అంతేకాకుండా ఖైదీ,ఖాఖీ సినిమాల ప్రేరణ కూడా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా విజయంపై తన రైటింగ్ కెరీర్ ఆధారపడి ఉంటుందని, రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.  నాగశౌర్య హీరోగా, హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ లో నిర్మించిన 'అశ్వద్ధామ' సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యాక్షన్, థ్రిల్లర్ గా తయారైన ఈ సినిమాకు కథకుడు కూడా నాగశౌర్యనే. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది.

చిన్న చిన్న కట్ ఇచ్చారు. మొత్తం నిడివి రెండు గంటల ఏడు నిమషాలు వచ్చింది. మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గిబ్రాన్ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, శ్రీచరణ్ పాకాల పాటలు అందించారు.  ఈనెల 31న విడదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత ఉష మాల్పూరి. విశాఖ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఇటీవల ఎక్కువగా జరుగుతున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు అన్నది బేసిక్ పాయింట్. ఈ నేఫథ్యంలోనే నాగశౌర్య కథ రాసుకున్నారు. ఈ సినిమాతో రమణ తేజ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు.

click me!