అసురన్ రీమేక్.. వెంకీతో సీనియర్ హీరోయిన్

By Prashanth MFirst Published Nov 8, 2019, 11:58 AM IST
Highlights

తంలో మాదిరిగా నచ్చిన ప్రతి కథను చేయకుండా.. ఎంచుకునే కథలు ఆడియెన్స్ కి నచ్చుతాయా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా సురేష్ బాబు అసురన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఆ సినిమాలో నటించడానికి వెంకీ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. 

F2 సక్సెస్ అనంతరం వెంకటేష్ చాలా జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. గతంలో మాదిరిగా నచ్చిన ప్రతి కథను చేయకుండా.. ఎంచుకునే కథలు ఆడియెన్స్ కి నచ్చుతాయా లేదా అని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాడు. ఇకపోతే రీసెంట్ గా సురేష్ బాబు అసురన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

 

అయితే ఆ సినిమాలో నటించడానికి వెంకీ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కథను కరెక్ట్ తెలుగు ఆడియెన్స్ కి నచ్చే విధంగా తెరకెక్కించే దర్శకుల కోసం వెతుకుతున్నాడు. ఇక ముందుగానే హీరోయిన్ విషయంలో కూడా సురేష్ బాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

హీరోయిన్ శ్రియ అయితే సినిమాలో కరెక్ట్ గా సెట్టవుతుందని వెంకీ సలహా మేరకు ఫైనల్ చేసేసారట. గతంలో ఈ బ్యూటీ వెంకీతో రెండు సినిమాలు చేసింది.  సుభాస్ చంద్రబోస్ - గోపాల గోపాల సినిమాల్లో వెంకీ సరసన నటించిన శ్రియ మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఇక ఇప్పుడు పెళ్లి తరువాత మొదటిసారి వెంకీతో కనిపించడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతానికి వెంకీ లాంటి సీనియర్ హీరోకి సెట్టయ్యే హీరోయిన్స్ అయితే ఎవరూలేరు. సో బెటర్ అప్షన్ గా శ్రియను సెలెక్ట్ చేసుకున్నారు.

ప్రస్తుతం వెంకటేష్ వెంకిమామ సినిమాకు ఎండింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అలాగే తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!