నిన్ను కోల్పోయి ఎంతో వేదన చెందా.. హీరో ఎమోషనల్ పోస్ట్!

Published : Feb 03, 2020, 03:21 PM IST
నిన్ను కోల్పోయి ఎంతో వేదన చెందా.. హీరో ఎమోషనల్ పోస్ట్!

సారాంశం

ఈరోజు అర్జున్ కపూర్ తల్లి పుట్టినరోజు కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. నువ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. 

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోషల్ మీడియా అకౌంట్ లో తన తల్లిని ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈరోజు అర్జున్ కపూర్ తల్లి పుట్టినరోజు కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. నువ్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. 

తన తల్లితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. 'ఈ ఫోటో మనం కలిసి జరుపుకొన్న చివరి పుట్టినరోజు నాటిది.. ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో జరగాలని నేను కోరుకున్నా.. నిజంగా నిన్ను మిస్ అవుతున్నా అమ్మా..' అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.

'25 ఏళ్ల వయసులో నిన్ను కోల్పోయినపుడు ఈ సొసైటీ నేను ఎలా ఉండాలనైతే భావించిందో.. అంతే దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాను. నీ జీవితం ముగిసిపోయిన తరువాత చాలా రోజుల పాటు నేను ఎంతగా వేదన చెందానో.. నాకే తెలుసు.. అయితే నీ ముందు కూర్చుని.. నిన్ను విసిగించడం మాత్రం ఇప్పటికీ మానలేదు. హ్యాపీ బర్త్ డే అమ్మా.. మనం ఇలాగే కలిసి మరింత సమయం గడుపుదాం' అంటూ రాసుకొచ్చాడు.

అర్జున్ కపూర్ తల్లి మోనా శౌరీ 2012లో క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్యే మోనా.. వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ లు సంతానం. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?