'దర్బార్' దెబ్బ.. కోర్టుకెళ్లిన మురుగదాస్!

By AN TeluguFirst Published Feb 6, 2020, 12:37 PM IST
Highlights

రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ రూపొందించిన 'దర్బార్' సినిమాని కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ  వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు. 

'దర్బార్' సినిమా డిస్ట్రిబ్యూటర్ల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించాడు. రజినీకాంత్ హీరోగా దర్శకుడు మురుగదాస్ రూపొందించిన 'దర్బార్' సినిమాని కొని డిస్ట్రిబ్యూటర్లుగా తాము నష్టపోయామని, నష్టాలకు తనను బాధ్యుడిని చేస్తూ  వ్యాజ్యాన్ని దాఖలు చేస్తామని డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మురుగదాస్ పేర్కొన్నాడు.

తనకు డిస్ట్రిబ్యూటర్ల వలన హాని ఉందని.. రక్షణ కల్పించాలని కోర్టుని కోరాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన 'దర్బార్' సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈ సినిమా వలన తాము నష్టపోయామని డిస్ట్రిబ్యూటర్లు బహిరంగంగానే ప్రకటించారు.

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అరెస్ట్.. కారణం ఇదే!

రజినీని కలిసి 'దర్బార్' సినిమా నష్టాలను గురించి వివరించాలనుకున్న డిస్ట్రిబ్యూటర్లకు నిరాశే మిగిలింది. గత వారంలో చెన్నైలో రజినీ ఇంటికి వెళ్లి కలవడానికి డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నించగా.. వారికి అనుమతి లభించలేదు. దర్శకుడు మురుగదాస్ ని కలవాలని ప్రయత్నించిన వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో ఇక లాభం లేదనుకున్న డిస్ట్రిబ్యూటర్లు కోర్టుని ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చారు.

అయితే ఈ వివాదంలో అభిమానులు రజినీకాంత్ కి, మురుగదాస్ కి మద్దతుగా నిలుస్తున్నారు. 'దర్బార్' సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనే తీసుకొచ్చిందని.. లాభాలు రాకుండానే కొందరు డిస్ట్రిబ్యూటర్లు సినిమా విడుదలైన నాలుగు రోజుల తరువాత రజినీకాంత్ తో కలిసి నవ్వుతూ ఫోటోలు దిగారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కావాలనే రజినీకాంత్ ని తక్కువ చేయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. 

click me!