లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. సాధారరణంగా వయసు పెరిగే కొద్దీ హీరోయిన్ల క్రేజ్ తగ్గుతూ వస్తుంది. కానీ నయనతార అందుకు భిన్నం. 35 ఏళ్ల వయసులో కూడా నయనతార తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతోంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. సాధారరణంగా వయసు పెరిగే కొద్దీ హీరోయిన్ల క్రేజ్ తగ్గుతూ వస్తుంది. కానీ నయనతార అందుకు భిన్నం. 35 ఏళ్ల వయసులో కూడా నయనతార తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతోంది. సౌత్ లో అగ్ర హీరోల సరసన కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా దూసుకుపోతోంది.
ఆ మధ్యన నయనతార దర్శకుడు మురుగదాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మురుగదాస్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం గజినీలో నయన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో నయనతార పాత్రకు ఆసిన్ రోల్ కన్నా కాస్త ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. గజినీ చిత్రానికి అంగీకరించడం తన కెరీర్ లో చేసిన పెద్ద తప్పు అని నయన్ ఆ మద్యన ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.
undefined
దర్శకుడు చెప్పినదానికి.. తన పాత్ర చిత్రీకరించిన విధానానికి ఏమాత్రం పొంతన లేదని.. గజినీ చిత్రంతో తాను చాలా నిరాశ చెందానని మురుగదాస్ పై నయనతార కామెంట్స్ చేసింది.
నయనతార వ్యాఖ్యలపై మురుగదాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఏదైనా చిత్రంలో దర్శకుడికి ఒక పాత్ర నచ్చినా నచ్చకున్నా.. నటీనటులలో మనకు ఇష్టమైనవారు, ఇష్టం లేనివారు ఉన్నప్పటికీ ఆ పాత్రని తగ్గించడం కానీ, పెంచడం కానీ జరగదు. ఎందుకంటే కథ అలా రెడీ అయిపోయి ఉంటుంది.
రకుల్ ఆశలు గల్లంతు చేసిన నిర్మాత.. ఐదేళ్ల కష్టం వృధా!
నా చిత్రాల్లో నాకు ఇష్టమైన నటీనటులు చాలా చిన్న పాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని మురుగదాస్ చెప్పుకొచ్చారు. ఒక నటుడి కోసం పాత్రని మార్చడం జరగదని మురుగదాస్ పేర్కొన్నారు. కథ పరంగానే గజినీ చిత్రంలో నయనతార ఆ రోల్ లో నటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
2005లో గజినీ చిత్రం విడుదలయింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత నయనతార మరోసారి మురుగదాస్ దర్శత్వంలో దర్బార్ చిత్రంలో నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.