అమ్మాయిగా పుట్టడం నేరమా..? ప్రియాంకా హత్యపై అనుష్క ఆవేదన!

By AN Telugu  |  First Published Nov 29, 2019, 4:43 PM IST

ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్షఅమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. 


హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు సంచలనం సృష్టించింది. ఈ నెల 27న ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంక తిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగా ఉందని చెప్పిన కొద్ది సేపటికే ఆమె ఫోన్స్విచ్ ఆఫ్ అయ్యింది.

బుధవారం నాడు మిస్ అయిన ప్రియాంకారెడ్డి గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. ప్రియాంక రెడ్డిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి అతిదారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారు.

Latest Videos

undefined

ప్రియాంక మర్డర్ కేసు.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వీడియోస్

ఈ ఘటన తెలంగాణా రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్షఅమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ప్రియాంకా హత్యపై స్పందిస్తున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు.

ఈ క్రమంలో నటి అనుష్క సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయింది. అమాయకురాలైన ప్రియాంకా రెడ్డిపై అత్యాచారం ఆపైన హత్య చేశారని.. ఇది మానవాళిని కదిలించే విషాదకరమైన ఘటన అని అన్నారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని గనుక జంతువులతో పోలిస్తే అవి సిగ్గుపడతాయని అన్నారు.

మన సమాజంలో ఒక అమ్మాయిగా పుట్టడం నేరమా..? అని ప్రశ్నించారు. ఈ ఘోరానికి పాల్పడిన వారికి వెంటనే శిక్షపడే విధంగా అందరం కలిసి పోరాటం చేద్దామని అన్నారు. ప్రియాంకా రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#RIPPriyankaReddy 😥

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on Nov 29, 2019 at 1:07am PST

click me!