అంతా షాక్: రాఘవేంద్రరావు కొడుకుతో అనుష్క వివాహం..?

By telugu news teamFirst Published Feb 27, 2020, 3:01 PM IST
Highlights

ఆ ప్లాఫ్ దర్శకుడు మరెవరో కాదు...అనగనగా ఒక థీరుడు, సైజ్ జీరో, జడ్జిమెంట్ హై క్యా చిత్రాల దర్శకుడు ప్రకాష్ కోవెలపూడి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు అయిన ప్రకాష్ కోవెలపూడి తో ఆమె వివాహం జరగబోతుందని చెప్తున్నారు. 

గత కొంతకాలంగా ప్రభాస్ వివాహంతో పాటు అనుష్క పెళ్లి  హాట్ టాపిక్కుగా ఉంటూ వస్తోంది.  బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్న స్దాయి క్వచ్చిన్ గా మారింది. బాహుబలి చిత్రం తర్వాత హీరోలతో సమానమైన అభిమాన బలం పెంచుకున్న ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని మీడియా వారు ఎప్పుడూ అదే టాపిక్ తెస్తున్నారు.ఈ మేరకు ఈ విషయమై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. తాజాగా వచ్చిన మరో రూమర్..అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఆమె తెలుగులో ఓ ప్లాఫ్ డైరక్టర్ ని వివాహం చేసుకోబోతోందని ఆ వార్త లాంటి రూమర్ సారాంశం.

ఎవరెన్ని అనుకున్నా.. అతడినే పెళ్లి చేసుకుంటా.. అనుష్క కామెంట్స్!
 
ఆ ప్లాఫ్ దర్శకుడు మరెవరో కాదు...అనగనగా ఒక థీరుడు, సైజ్ జీరో, జడ్జిమెంట్ హై క్యా చిత్రాల దర్శకుడు ప్రకాష్ కోవెలపూడి. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు అయిన ప్రకాష్ కోవెలపూడి తో ఆమె వివాహం జరగబోతుందని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రకాష్ కు వివాహం జరిగి డైవర్స్ అయ్యింది. ప్రముఖ స్క్రిప్టు రైటర్ కనిక థిల్లాన్ ఆయన మొదట భార్య. ఇక అనుష్క..ప్రకాష్  కాంబినేషన్ లో గతంలో సైజ్ జీరో సినిమా వచ్చింది.  

ఇక తరుచుగా వచ్చే పెళ్లి వార్త‌ల‌పై రీసెంట్ గా స్పందించింది. ప్ర‌స్తుతం తాను ఎవ‌రితోనూ ప్రేమ‌లో లేన‌ని, ఎవ‌రినీ తాను ప్రేమించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేసింది. త‌ను ప్రేమ‌లో వున్నాన‌ని, త‌ర‌చూ వార్త‌లు వినిపిస్తున్నాయ‌ని, ఆ వార్త‌లు విన్న‌ప్పుడు చాలా బాధ‌గా వుంటుంది. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు` అని అనుష్క పేర్కొంది.

అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం `నిశ్శ‌బ్దం`. మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంక‌ట్‌, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ  చిత్రం నాలుగు భాష‌ల్లో వర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

 

click me!