జూనియర్ ఎన్టీఆర్ కి సవాల్ విసిరిన యాంకర్ సుమ!

Published : Nov 13, 2019, 04:07 PM ISTUpdated : Nov 13, 2019, 04:09 PM IST
జూనియర్ ఎన్టీఆర్ కి సవాల్ విసిరిన యాంకర్ సుమ!

సారాంశం

హరితహారం కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. 

తెలంగాణా రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఛాలెంజ్ పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టారు.

హరితహారం కార్యక్రమం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ ఛాలెంజ్’ ఉద్యమం సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంది. హరితహారం కోసం సినీ, రాజకీయ, క్రీడా రంగానికి సంబంధించిన వాళ్లు పాల్గొంటున్నారు.

Anchor Rashmi: లెస్బియన్ గా మారిన యాంకర్ రష్మి..!

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి సాయి పల్లవి, వరుణ్ తేజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, చిరంజీవి, నాగార్జున, రాజేంద్రప్రసాద్, మహేష్ బాబు ఇలా చాలా మంది సెలబ్రిటీలు మొక్కలు నాటారు. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సుమ ఈ ఛాలెంజ్ ని స్వీకరించారు.

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నటి జయసుధ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన సుమ ఉషాకిరణ్ మూవీస్ కి సంబంధించిన మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా హీరో జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి, రాహుల్ సిప్లిగంజ్, ఓంకార్ లకు ఈ ఛాలెంజ్ ని స్వీకరించాలని సవాల్ విసిరారు. అలానే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌కు సుమ కృతజ్ఞతలు తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?