రూ.45లక్షల మోసం.. పోలీస్ స్టేషన్ లో యాంకర్ రవి!

prashanth musti   | Asianet News
Published : Feb 10, 2020, 10:25 AM ISTUpdated : Feb 10, 2020, 10:28 AM IST
రూ.45లక్షల మోసం.. పోలీస్ స్టేషన్ లో యాంకర్ రవి!

సారాంశం

డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఒక సినీ ప్రముఖుడిపై యాంకర్ రవి పోలీసులకు పిర్యాదు చేశాడు. సందీప్ అనే వ్యక్తి తన దగ్గర సినిమా కోసం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదని ఒక సినీ ప్రముఖుడిపై యాంకర్ రవి పోలీసులకు పిర్యాదు చేశాడు. సందీప్ అనే వ్యక్తి తన దగ్గర సినిమా కోసం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన సందీప్ అనే వ్యక్తిపై రవి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ కోసమని సందీప్ అనే సినీ ప్రముఖుడు నా దగ్గర 45లక్షలు తీసుకున్నట్లు రవి ఫిర్యాదులో పేర్కొన్నారు. చెప్పిన సమయానికి డబ్బు తిరిగి ఇవ్వమని చెబితే.. కొంత డబ్బు మాత్రమే ఇచ్చి మిగాతా డబ్బు ఇవ్వకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడని అన్నారు.

అలాగే కొంతమంది వ్యక్తలను తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా రవి పేర్కొన్నారు.  ఇదివరకే సందీప్ కొంత మంది దగ్గర డబ్బులు తీసుకొని ఇలానే మోసం చేశాడని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని యాంకర్ రవి ఫిర్యాదు ద్వారా పోలీసులకు వివరణ ఇచ్చారు. రవి ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?