
సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కామన్ గా మారింది. అయితే ఆ డోస్ ఇటీవల కాలంలో మరీంత పెరిగింది. ముఖ్యంగా సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ వస్తున్న కామెంట్స్ షాక్ కి గురి చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా యాంకర్ అనసూయ ఒక పోస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ పై అనసూయ కౌంటర్ ఇచ్చింది.
కానీ కొన్ని ఫెక్ ఎకౌంట్స్ నుంచి అసభ్యకర పదజాలంతో మరీంత శృతి మించుతున్నారు. హీరోయిన్ అనుష్కపై అలాగే అనసూయపై అసభ్యకరంగా పోస్ట్ చేయడం పై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ట్విట్టర్ ని కూడా ప్రశ్నించారు. "మీ నియమాలను" తిరిగి అంచనా వేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను .. ఇది ఉల్లంఘించకపోతే మరేంటి .. ఈ విషయంలో మిమ్మల్ని నిందించడానికి నేను సిగ్గుపడను" అంటూ సైబర్ క్రైమ్ ని ఆశ్రయించారు.
వెంటనే స్పందించిన సైబర్ క్రైమ్ అధికారులు.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.