ఓవర్సీస్ బిజినెస్ కి 'అమెజాన్ ప్రైమ్' దెబ్బ!

By AN TeluguFirst Published Oct 12, 2019, 3:15 PM IST
Highlights

అమెజాన్ ప్రైమ్ ఓవర్సీస్ బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏ సినిమానైతే అమెజాన్ కొంటుందో ఇక ఆ సినిమా కోసం థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. 

సినిమాలకు ఓవర్సీస్ బిజినెస్ అనేది చాలా ముఖ్యం. అక్కడ ప్రీమియర్ షోలు, వీకెండ్ టైంలో వచ్చే కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్స్ కి కీలకం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండడం లేదు. ఒకప్పుడు ఓవర్సీస్ లో సినిమాలకు పలికే ధర ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. అక్కడ ఆఫర్లు తగ్గిపోవడం, మూవీ పాస్ లేకపోవడం కొన్ని కారణాలైతే ప్రధానంగా అమెజాన్ ప్రైమ్ ఓవర్సీస్ బిజినెస్ పై ఇంపాక్ట్ చూపిస్తుంది.

ఏ సినిమానైతే అమెజాన్ కొంటుందో ఇక ఆ సినిమా కోసం థియేటర్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. మరీ సినిమా మీద ఆసక్తి ఉన్న వారు తప్ప మిగిలిన వారెవరూ కూడా థియేటర్లకు రావడం లేదు. థియేటర్లకు వచ్చి వందల డాలర్లు ఖర్చు పెట్టుకోవడం కంటే నెల రోజులు ఆగితే అదే సినిమాను హోం థియేటర్ లో వేసుకొని చూసుకోవచ్చని భావిస్తున్నారు.

తమకి కావాల్సినప్పుడు చూసుకోవడం, రిపీట్ లు వేసుకోవడం వంటివి చేయొచ్చు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం పూర్తిగా తగ్గిపోయింది. అలానే ఒకసారి చూసి సరిపెట్టుకోని రిపీట్ ఆడియన్స్ పై కూడా అమెజాన్ ప్రైమ్ ప్రభావం చూపిస్తోంది. మరీ నాలుగు వారాలు తిరగకుండా కొన్ని సినిమాలు ప్రైమ్ లో వచ్చేస్తూ ఉండడంతో సినిమా బిజినెస్ పై మరింత దెబ్బ పడుతుంది.

ఈ ప్రభావం ఓవర్సీస్ లో మాత్రమే కాదు.. స్థానికంగా కూడా ఉంది. మెట్రో సిటీస్ లో రిపీట్ ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతోంది. హాలీవుడ్ సినిమాలైతే మూడు, నాలుగు నెలలకు ఒకసారి కానీ స్ట్రీమ్ చేయరు. కొన్ని సినిమాలకు ఆరేసి నెలలు సమయం తీసుకుంటారు. కానీ మన సినిమాలకు మాత్రం ఆ పరిస్థితి ఎందుకు ఉండడం లేదంటూ బయ్యర్లు గోలపెడుతున్నారు. 
 

click me!