అల్లు అర్జున్ ఫ్యామిలిలో విషాదం.. ఆయన మృతి, హుటాహుటిన విజయవాడకు..

Published : Jan 22, 2020, 08:43 PM IST
అల్లు అర్జున్ ఫ్యామిలిలో విషాదం.. ఆయన మృతి, హుటాహుటిన విజయవాడకు..

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో అల్లు ఫ్యామిలిలో ఓ విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తల్లి నిర్మల దేవి తరుపున బంధువు ఒకరు హార్ట్ అటాక్ తో విజయవాడలో మృతి చెందారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో అల్లు ఫ్యామిలిలో ఓ విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ తల్లి నిర్మల దేవి తరుపున బంధువు ఒకరు హార్ట్ అటాక్ తో విజయవాడలో మృతి చెందారు. మరణించిన వ్యక్తి.. నిర్మల దేవి సోదరుడు ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ కు దగ్గర బంధువు. 

మరణించిన వ్యక్తి అల్లు అర్జున్ కు పెద్ద మామయ్య వరస అవుతాడట. అతడితో బన్నీకి మంచి ఎమోషనల్ అటాచ్ మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. మరణ వార్త తెలియగానే బన్నీ ఫ్యామిలీ మొత్తం బుధవారం రోజు విజయవాడకు వెళ్లారు. 

ఆయన ఆకస్మిక మరణం అల్లు ఫ్యామిలీని షాక్ లోకి నెట్టేసింది. ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామి అవుతుంటారు. మరణించిన వ్యక్తి ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ కు అనే సహాయ సహకారాలు అందించినట్లు తెలుస్తోంది. 

స్టార్ హీరోకి అదిరిపోయే కౌంటర్.. 'మహాభారతం' ఏమిటని ప్రశ్నించిన కంగన!

అల్లు అర్జున్ తదుపరి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ కూడా ఓ నిర్మాత. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?