అల వైకుంఠపురములో జోరు.. 'భరత్ అనే నేను' రికార్డ్ బ్రేక్

By tirumala ANFirst Published Jan 27, 2020, 2:50 PM IST
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం టాలీవుడ్ లో ఒక్కో రికార్డ్ ని తుడిచిపెడుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్నీ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ, పూజ హెగ్డే గ్లామర్, తమన్ సంగీతం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

నా పేరు సూర్య చిత్రంతో నిరాశపడ్డ బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ చిత్రంలో నటించాడు. మాట ఇచ్చినట్లుగా అభిమానులకు ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించాడు. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత కూడా అల వైకుంఠపురములో కలెక్షన్స్ జోరు తగ్గడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల షేర్ రాబట్టింది. 

త్రివిక్రమ్ చిత్రాలకు యుఎస్ లో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అల వైకుంఠపురములో చిత్రం కూడా ఓవర్సీస్ లో డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే మూడు మిలియన్ల డాలర్ మార్కుని అందుకున్న బన్నీ చిత్రం తాజాగా మహేష్ బాబు భరత్ అనే నేను చిత్ర రికార్డుని అధికమించింది. దీని ద్వారా యుఎస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రాల్లో అల వైకుంఠపురములో చిత్రం నాల్గవ స్థానంలో నిలిచింది. 

ఎన్టీఆర్ పక్కన రష్మిక.. జాక్‌పాట్‌ కొట్టినట్లే..!

ఇప్పటి వరకు అల వైకుంఠపురములో చిత్రం 3.42మిలియన్ డాలర్స్ రాబట్టింది. భరత్ అనే నేను చిత్రం ఫుల్ రన్ లో 3.41 డాలర్స్ రాబట్టడం విశేషం. అల వైకుంఠపురములో చిత్రం ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం చిత్రంపై కన్నేసింది. రంగస్థలం బాహుబలి రెండు భాగాల తర్వాత యుఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 

రంగస్థలం యూఎస్ లో 3.5 మిలియన్ డాలర్స్ రాబట్టింది. త్వరలో ఈ రికార్డుని కూడా అల్లు అర్జున్ చిత్రం అధికమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!