గమనించారా? సంక్రాంతి రిలీజ్ లు రెండింటికి అదే సమస్య

By AN TeluguFirst Published Jan 7, 2020, 4:26 PM IST
Highlights

ఇప్పటికే ఈ రెండు సినిమాలు ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమయ్యాయి. రెండు సినిమాలు ఏ కట్స్ లేకుండా యుఎ సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి.

ఈ 2020 సంక్రాంతికి నాలుగు సినిమాలు రీలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అవి రజనీకాంత్-దర్బార్, మహేశ్‌బాబు-సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్-అల వైకుంఠపురంలో.., కల్యాణ్‌రామ్-ఎంత మంచివాడవురా… ఈ నాలుగు సినిమాల్లో రెండింటి మధ్య గట్టి పోటీ నెలకొంది. మరీ ముఖ్యంగా మహేశ్, అల్లు అర్జున్ సినిమాలపై సినీ వర్గాలతోపాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో.. సినిమాలు అటు హీరోలకే కాకుండా.. వారి అభిమానులకు ప్రతిష్టాత్మకం అయ్యాయి.

ఇప్పటికే ఈ రెండు సినిమాలు ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమయ్యాయి. రెండు సినిమాలు ఏ కట్స్ లేకుండా యుఎ సర్టిఫికేట్ తెచ్చుకున్నాయి. అదే సమయంలో రెండు సినిమాలకు రన్ టైమ్ ఎక్కువ ఉండటం గమనించదగ్గ విషయం.  సరిలేరు నీకెవ్వరు చిత్రం 169 నిముషాలు. అలాగే అలవైకుంఠపురం కూడా 165 నిముషాలు.

మోహన్ బాబుతో కలిపి ఇద్దరినీ ఏకేసిన శ్రీరెడ్డి!

సాధారణంగా 160 నిముషాలు అంటే రెండు గంటల నలభై నిముషాలు సినిమా ఉంటేనే చాలా పెద్ద సినిమా అని గోలెత్తిపోతూంటారు. ఆ లెక్కల్లో చూస్తే ఈ రెండు సినిమాలకు లెంగ్త సమస్యే. అయితే కంటెంట్ అంత గొప్పగా ఎంగేజ్ చేసేలాగ ఉంటే లెంగ్త్ సమస్య కాలేదని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. చూడాలి మరి లెంగ్త్ ఈ సినిమాలకు ఏ మేరకు కలిసొస్తుందో..సమస్యగా మారుతుందో.

 

click me!