మహేష్ తో ఫైట్.. మరో పోస్టర్ తో షాకిచ్చిన బన్నీ?

prashanth musti   | Asianet News
Published : Jan 04, 2020, 03:29 PM IST
మహేష్ తో ఫైట్.. మరో పోస్టర్ తో షాకిచ్చిన బన్నీ?

సారాంశం

'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన చర్చల ప్రకారం ముందు బన్నీ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు చెప్పారు.

టాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఇద్దరు స్టార్ హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ యుద్ధం మొదలుకాబోతోంది. 'మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో' సినిమాలు రెండు కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలో జరిగిన చర్చల ప్రకారం ముందు బన్నీ సినిమా జనవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు చెప్పారు.

ఇక మహేష్ సినిమా జనవరి 11న రాబోతున్నట్లు చెప్పారు. అయితే ఎవరు ఊహించని విధంగా రిలీజ్ డేట్స్ లో మరోసారి గందరగోళం మొదలైంది. ఎందుకంటె అల వైకుంఠపురములో సినిమా జనవరి 11న రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. మహేష్ సినిమాతో బన్నీ సినిమా పోటీకి సిద్ధమైంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

పోనీ అదంతా ఫేక్ న్యూస్ అనుకుంటే.. ఒక మల్టిప్లెక్స్ లో సెట్ చేసిన పోస్టర్ లో కూడా జనవరి 11 అని ఉంది. మొత్తానికి బన్నీ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'తో పోటీకి సిద్దమైనట్లు తెలుస్తోంది.  ఇదంతా అల్లు అర్జున్ అభిమానులను కాస్త కన్ఫ్యూజన్ కి గురి చేసే విషయం. సినిమా విడుదల కావడానికి ఎక్కువ సమయం లేదు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇలాంటి విషయాలపై స్పందించకపోవడం గమనార్హం. సంక్రాంతి సీజన్ కి అన్ని సినిమాలు హిట్టవుతాయని రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడం ఎంతవరకు రిస్క్ అనేది నిర్మాతలే ఆలోచించుకోవాలి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందించేవరకు వెయిట్ చేయాల్సిందే.

హ్యాట్రిక్ పై కన్నేసిన శర్వా.. 2020లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్?

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?