అక్కినేని హీరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ తోనే కొట్టేశాడు

prashanth musti   | Asianet News
Published : Dec 21, 2019, 05:05 PM ISTUpdated : Dec 21, 2019, 05:06 PM IST
అక్కినేని హీరో డిఫరెంట్ మూవీ.. టైటిల్ తోనే కొట్టేశాడు

సారాంశం

యువ హీరో సుశాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ ని అందుకోవడం లేదు. కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ అవుదామనుకున్న సుశాంత్ చివరికి లవ్ స్టోరిలవైపే యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. 

అక్కినేని  ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో సుశాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా ఇంకా సరైన సక్సెస్ ని అందుకోవడం లేదు. కమర్షియల్ యాంగిల్ లో సక్సెస్ అవుదామనుకున్న సుశాంత్ చివరికి లవ్ స్టోరిలవైపే యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. మొత్తానికి "చి.లా.సౌ" అనే సినిమాతో ఒక డిఫరెంట్ హిట్ అందుకున్నాడు.

ఆ ఇద్దరు దర్శకులలో.. శంకర్ డైరెక్షన్ లోనే నటిస్తా.. కేజిఎఫ్ హీరో కామెంట్స్!

కమర్షియల్ గా ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో డిఫరెంట్ హిట్ అందుకోవడానికి అడుగులు వేస్తున్నాడు. నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే టైటిల్ ని సెట్ చేశారు.

దర్శన్ ఈ సినిమా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ఇక సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. టైటిల్ తోనే సుశాంత్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుశాంత్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడట. లేటయినా సరే మంచి సక్సెస్ అందుకోవాలని సుశాంత్ చేస్తున్న ప్రయత్నం మంచిదనే చెప్పాలి.  

మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక సుశాంత్ హీరోగానే కాకుండా స్టార్ హీరోల సినిమాలో స్పెషల్ పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ "అల.. వైకుంఠపురములో.." సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొక పెద్ద సినిమాలో కూడా నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?