ఐటీ అధికారుల ముందు నిర్మాత కూతురు!

By AN TeluguFirst Published Feb 13, 2020, 10:11 AM IST
Highlights

ఈ వ్యవహారంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్ లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

ఆదాయపన్ను శాఖా అధికారుల ముందుకు ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్చన కల్పత్తి బుధవారం నాడు హాజరయ్యారు. 'బిగిల్' సినిమా వసూళ్ల వ్యవహారంలో ఐటీ శాఖకు పన్ను చెల్లించలేని కారణంగా ఆదాయశాఖ అధికారులు ఇటీవల ఈ చిత్ర నిర్మాత సంస్థ కార్యాలయం, నిర్మాతల ఇళ్లు, నటుడు విజయ్ కి చెందిన ఇళ్లు, ఫైనాన్షియర్ అన్బుచెలియన్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇందులో అన్బుచెలియన్ ఇళ్లు, కార్యాలయంలో రూ.77 కోట్లు, రూ.300 కోట్ల విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్ లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.

సీఎం జగన్, పీకేలతో విజయ్.. కలకలం రేపుతోన్న పోస్టర్లు!

విజయ్ 'మాస్టర్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఆయన ఆడిటర్ మంగళవారం నాడు నుంగంబాక్కంలోని ఐటీశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరణ ఇచ్చారు. కాగా, బుధవారం ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు, ఆ సంస్థ అధినేత అఘోరం కల్పత్తి కూతురు అర్చన ఆదాయపు పన్ను శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.

అప్పుడు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు అయెం బదులిచ్చినట్లు తెలుస్తోంది. అలానే డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ తరఫున ఆయనకి సంబంధించిన వ్యక్తి హాజరయ్యారు.  ఫైనాన్సియర్‌ అన్బుచెలియన్‌ మాత్రం ఇంకా ఐటీ అధికారుల ముందుకు హాజరు కాలేదు.

దీంతో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. కాబట్టి అన్బు లేదా ఆయన తరఫున వ్యక్తి అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.  

click me!