మంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి'.. లేటెస్ట్ అప్డేట్!

By Prashanth MFirst Published Feb 13, 2020, 10:09 AM IST
Highlights

సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో మంచు మనోజ్ ఒకరు. మంచి ఎనర్జీతో కనిపించే ఈ కుర్ర హీరో ఎలాంటి సినిమా చేసినా తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ఈ యంగ్ హీరో కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ లు అందుకోలేకపోయారు.

టాలీవుడ్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో మంచు మనోజ్ ఒకరు. మంచి ఎనర్జీతో కనిపించే ఈ కుర్ర హీరో ఎలాంటి సినిమా చేసినా తనదైన శైలిలో సిల్వర్ స్క్రీన్ పై యాక్టివ్ గా కనిపిస్తుంటాడు. ఈ యంగ్ హీరో కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా సక్సెస్ లు అందుకోలేకపోయారు. ఆ మధ్య పలు సామజిక అంశాలపై స్పందిస్తూ హడావుడిగా అకనిపించి మనోజ్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ గట్టిగానే  టాక్ వచ్చింది.

ఇక భార్యతో విడాకులు తీసుకోవడంతో ఆ వార్త అందరిని ఆశ్చర్యపరిచింది. కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనోజ్ మొత్తానికి మళ్ళీ రెగ్యులర్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. సినిమాలు చేయడానికి ఒక సొంత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. MM ఆర్ట్స్ అనే బ్యానర్ లో మనోజ్ సొంతంగా తన సినిమాను తనే నిర్మించుకోనున్నాడు. ఇక సినిమా టైటిల్ 'అహం బ్రహ్మాస్మి' అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

మార్చ్ 14 సినిమా లాంచ్ కానుంది. గత కొన్నేళ్లుగా మనోజ్ కి దగ్గరగా ఉంటున్న కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఆ సినిమాను  డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న మనోజ్ త్వరలోనే తన కొత్త సినిమా గురించి మరిన్ని విషయాలని తెలియజేయనున్నారు. ఇక రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నాభా నటేష్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా మంచు హీరో నభా వైపే ముగ్గు చూపాడని టాక్.

click me!