చిన్న సైజు అద్భుతం.. ఈసారి ఇంకాస్త పెద్దగా.. రెడీ అవుతున్న ASSA హీరో

Published : Apr 28, 2020, 04:24 PM IST
చిన్న సైజు అద్భుతం.. ఈసారి ఇంకాస్త పెద్దగా.. రెడీ అవుతున్న ASSA హీరో

సారాంశం

పెద్ద సినిమాల ఒత్తిడిని తట్టుకుని చిన్న సినిమాలు రాణించడం కష్టం.. కానీ అసాధ్యం కాదు. మంచి కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమాకి అయినా ప్రేక్షాదరణ లభిస్తుందని గతంలో నిరూపించబడింది.

పెద్ద సినిమాల ఒత్తిడిని తట్టుకుని చిన్న సినిమాలు రాణించడం కష్టం.. కానీ అసాధ్యం కాదు. మంచి కంటెంట్ ఉంటే ఎంత చిన్న సినిమాకి అయినా ప్రేక్షాదరణ లభిస్తుందని గతంలో నిరూపించబడింది. అదే కోవకు చెందిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ(Agent Sai Srinivasa Athreya). క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన నవీన్ పోలిశెట్టి ఈ చిత్రంలో హీరోగా నటించాడు. 

ఏజెంట్ గా అతడి కామెడీ టైమింగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయంగా నిలిచింది. స్వరూప్ ఈ చిత్రానికి దర్శకుడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రాన్ని అంతా చిన్న సైజు అద్భుతంగా అభివర్ణించారు. 

'అవునయ్యా కొంపే మునిగింది'.. త్రిష, కోటపై వెంకీ కామెంట్స్ వైరల్!

ఈ చిత్ర దర్శకుడు స్వరూప్, హీరో నవీన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రానికి నవీన్ పోలిశెట్టి కోరైటర్ గా కూడా పనిచేశాడు. ఈ హిట్ కాంబో ఇద్దరూ తమ తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత ఈ చిత్ర ప్రిప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?