మారుతీరావు కూతురు అమృతపై నటి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

Published : Mar 09, 2020, 01:58 PM ISTUpdated : Mar 09, 2020, 02:06 PM IST
మారుతీరావు కూతురు అమృతపై నటి శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

సారాంశం

అమృత పరిస్థితి ఇప్పుడు మరి దయనీయంగా తయారయ్యింది. ఇటు భర్తను కోల్పోయి, అటు తండ్రిని కోల్పోయి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయింది. ఇక అమృత పరిస్థితిపై నటి శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. 

కూతురు కులాంతర వివాహం చేసుకుందని కక్షకట్టి, తన పరువు పోతుందని మాధానపడి అల్లుడు ప్రణయ్ ను అత్యంత పాశవికంగా కిరాయి హంతకులతో హత్య చేయించిన మారుతీ రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

భర్త మరణించినా కన్నా కూతురు తన దగ్గరకు రాకపోతుండడం, హత్యా కేసుకు సంబంధించి ఆయనకు శిక్ష పాడడం కూడా ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also read: మారుతీ రావు రెండు తప్పులు: వాటి మూల్యం... ఇద్దరికి వైధవ్యం!

ఇక ఈ ఉదంతం తరువాత అమృత నేటి ఉదయం తన తండ్రిని చివరిసారిగా కడసారి చూపు కోసం వెళితే... ఆమెకు ఆ అవకాశం దక్కకుండానే అక్కడి నుండి వెనక్కి పంపించివేశారు. తండ్రి చివరి చూపు కూడా దక్కకుండానే ఆమె వెనక్కి వచ్చింది. 

ఇక అమృత పరిస్థితి ఇప్పుడు మరి దయనీయంగా తయారయ్యింది. ఇటు భర్తను కోల్పోయి, అటు తండ్రిని కోల్పోయి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయింది. ఇక అమృత పరిస్థితిపై నటి శ్రీ రెడ్డి కామెంట్ చేసింది. 

అమృత బాధను తాను అర్థం చేసుకుంటున్నానని, జరిగిన నష్టం పూడ్చలేనిదని, దానికి తానెంతో చింతిస్తున్నానని చెబుతూ... అమృతకు, అమృత బిడ్డను దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని దీవించింది. 

ఇకపోతే, మారుతీ రావు హైదరాబాదులోని ఆర్యవైశ్య భవన్ లోని గదిలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గారెల్లో విషం కలుపుకుని అతను తిన్నాడని తేలింది. తన కూతురు అమృత వర్షిణి దళితుడైన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకోవడం అతని నచ్చలేదు. దీంతో కక్ష కట్టి ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు. 

Also read: ఒంటరైన మారుతీరావు భార్య..? నేరం ఎవరిది..? శిక్ష ఎవరికి?

ఆ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద విడుదలయ్యారు. ప్రణయ్ హత్య కేసు ట్రయల్స్ కోర్టులో తుది దశలో ఉన్నాయి. తనకు శిక్ష తప్పదనే భయంతోనే కాకుండా కూతురు తన వద్దకు రావడం లేదనే మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?