ఆయనతో ఉంటే సేఫ్ గా ఉంటా.. రేణుదేశాయ్ కామెంట్స్!

Published : Jan 29, 2020, 02:14 PM IST
ఆయనతో ఉంటే సేఫ్ గా ఉంటా.. రేణుదేశాయ్ కామెంట్స్!

సారాంశం

ఇటీవల రేణు 'చూసి చూడంగానే' అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణుదేశాయ్ తన పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తోంది. ఆ తరువాత రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం రేణు డైరెక్టర్ గా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతోంది.

అయితే ఇటీవల రేణు 'చూసి చూడంగానే' అనే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ఈ సినిమాతో హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న రేణుదేశాయ్.. రాజ్ కందుకూరిని పొగుడుతూ మాట్లాడారు.

కార్తీకదీపం వంటలక్క... స్టన్నింగ్ ఫోటోస్.. ఇలా ఎప్పుడూ చూసిఉండరు!

'చూసి చూడంగానే సినిమాలో తనకు తల్లి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారని.. కానీ ఆ సమయంలో ఒంట్లో బాలేకపోవడంతో సినిమా చేయలేకపోయానని అన్నారు. అసలు పాత్ర ఏంటో కూడా అడగలేదని.. రాజు గారు నిర్మాత అనగానే ఓకే చెప్పేద్దామని అనుకున్నట్లు.. ఆయనతో ఉన్నప్పుడు నేను సేఫ్ గా ఉంటానని అన్నారు.

అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరమని అన్నారు. మున్ముందు అన్ని చిత్ర పరిశ్రమల్లో మహిళా దర్శకులు, టెక్నీషియన్లు రావాలని.. వారికి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా చూసుకోవాలని అన్నారు.   

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?