అడ్జెస్ట్ కావాలి, రాత్రికి పిలిచారు.. మా అమ్మ ఓకే చెప్పేసింది, అందుకే సినిమాలు వదిలేశా

By tirumala ANFirst Published May 29, 2020, 10:50 AM IST
Highlights

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. దానికి కారణం రెండేళ్ల క్రితం ఇండియాలో ఉవ్వెత్తున ఎగసిన మీటూ ఉద్యమమే.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నటీమణులు కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. దానికి కారణం రెండేళ్ల క్రితం ఇండియాలో ఉవ్వెత్తున ఎగసిన మీటూ ఉద్యమమే. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది నటీమణులు తమకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు. 

తాజాగా తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కళ్యాణి అలియాస్ పూర్ణిత తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని వివరించింది. పలు చిత్రాల్లో కళ్యాణి హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా మెరిసింది. కళ్యాణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటనకు గుడ్ బై చెప్పడానికి గల కారణాన్ని వివరించింది. 

నాకు సినిమా అవకాశాలు వచ్చే సమయంలో నిర్మాణ సంస్థల నుంచి ఫోన్లు వచ్చేవి. తాము తెరకెక్కించే చిత్రంలో మీరే హీరోయిన్ అని చెప్పేవారు. మంచి ఆఫర్ వచ్చింది కదా అని సంతోషపడేలోపే అడ్జెస్ట్ కావాలి అని అడిగేవాళ్లు. 

ఎన్టీఆర్ గారు స్వర్గం నుంచి దీవించండి.. ఆ రాక్షసుడితో పోరాడాలి.. పూనమ్ కౌర్ సంచలనం

ఆరంభంలో అమ్మ అమ్మకు అడ్జెస్ట్ అంటే అర్థం అయ్యేది కాదు. డేట్స్ కి సంబందించిన అడ్జెస్ట్మెంట్ అని అనుకునేది. పడక గదిలోకి పిలుస్తున్నారని తెలియదు. దీనితో మా అమ్మ ఒకే చెప్పేసేది. విషయం అర్థం అయ్యాక అలాంటి ఫోన్ క్లాల్స్ ని కట్ చేసే వాళ్ళం అని కళ్యాణి పేర్కొంది. 

బుల్లితెరపైకి వచ్చాక కూడా అలాంటి తిప్పలు తప్పలేదు. ఓ కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్న సమయంలో ఆ ఛానల్ లో పై స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి రాత్రికి పబ్బులో కలుసుకుందాం అని అడిగాడు. పబ్బుకి రాను. సాయంత్రం కాఫీ షాప్ కు వెళదాం అని చెప్పాను. అప్పటి నుంచి నాకు బుల్లితెరపై కూడా ఛాన్సులు కరువయ్యాయని కళ్యాణి తెలిపింది. దీనితో తానూ నటనకు స్వస్తి చెప్పినట్లు పేర్కొంది. ప్రస్తుతం కళ్యాణి వివాహం చేసుకుని లైఫ్ లో సెటిల్ అయింది. 

click me!