సీనియర్‌ నటుడు రాఘవేంద్ర కన్నుమూత!

Published : Jan 30, 2020, 04:06 PM IST
సీనియర్‌ నటుడు రాఘవేంద్ర కన్నుమూత!

సారాంశం

ఆయనకి భార్య సులోచనా..  ఇద్దరు కూతుళ్లు కల్పన, షేకీనా శవాన్‌ ఉన్నారు. వీరందరూ కూడా సింగర్స్ కావడం విశేషం. తెలుగులో 'సింధుభైరవి' సినిమాలో హీరోయిన్ సుహాసినికి తండ్రి పాత్రలో కనిపించారు రాఘవేంద్ర. 

సీనియర్ నటుడు, గాయకుడు టీఎస్ రాఘవేంద్ర(75) కన్నుమూశారు. గతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం కేకే నగర్‌లోని నివాసంలో ఉంచారు.

ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి భార్య సులోచనా..  ఇద్దరు కూతుళ్లు కల్పన, షేకీనా శవాన్‌ ఉన్నారు. వీరందరూ కూడా సింగర్స్ కావడం విశేషం. 

హాలీవుడ్ ఫార్ములా వల్లే రాజమౌళికి సక్సెస్.. రజనీ క్లాస్ పీకారు: హీరో సుమన్

తెలుగులో 'సింధుభైరవి' సినిమాలో హీరోయిన్ సుహాసినికి తండ్రి పాత్రలో కనిపించారు రాఘవేంద్ర. అలానే రేవతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'వైదేహి కాత్రిరుందల్‌' సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు.

ఆయన చివరిగా నటించిన చిత్రం 'పోన్ మేఘాలై'. 2005లో ఈ సినిమా విడుదలైంది. నటుడిగానే కాకుండా.. గాయకుడిగా, స్వరకర్తగా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?