ఏడుస్తూ వెళ్లిపోయిన పరుచూరి.. కమెడియన్ పృథ్వి సంచలన కామెంట్స్!

By tirumala ANFirst Published Oct 20, 2019, 1:51 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోషషన్ మరోసారి గందరగోళం నెలకొంది. అసోసియేషన్ లోని సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి వాదోపవాదాలు చేసుకుంటున్నారు. గతంలో అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్, ఆ ఈవెంట్ లో సేకరించిన 5 కోట్ల డబ్బు గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తగాదాలు మరోమారు రచ్చకెక్కాయి. అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమం విషయంలో సభ్యుల మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గం మధ్య ఇగో ఫీలింగ్స్ కూడా తారాస్థాయికి చేరాయి. అధ్యక్షడిగా నరేష్ కు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని అతడి వర్గం జీవిత రాజశేఖర్ పై ఆరోణలు చేస్తున్నారు. 

MAAలో షాక్.. నరేష్ ని లెక్కచేయని జీవిత రాజశేఖర్.. సంచలన ఆరోపణలు!

ఈ వ్యవరాలపై చర్చించేందుకు నేడు ఫిలిం ఛాంబర్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. మా అసోషషన్ లో ఈసీ మెంబర్ గా ఉన్న కమెడియన్ పృథ్వి సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇది ఒక పనికిమాలిన సమావేశంగా పృథ్వి అభివర్ణించారు. పృథ్వి మీడియాతో మాట్లాడుతూ.. అర్జెంట్ మీటింగ్ అని మెసేజ్ పెట్టడంతో తిరుపతి నుంచి హడావిడిగా వచ్చా.. ఇది ఒక పనికిమాలిన మీటింగ్. మా అసోసియేషన్ సభ్యుల గురించి మాట్లాడకుండా అనవసరమైన విషయాలపై లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నారు. 

ఎవరి మాటకు ఎవరూ అసోసియేషన్ లో విలువ ఇవ్వడం లేదు. గతంలో అమెరికాలో జరిగిన ఈవెంట్ గురించి ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం సరికాదు. ఇదేదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమావేశంలా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే భరించలేం అని పృథ్వి కామెంట్స్ చేశారు. 

కొందరైతే మమ్మల్ని అమెరికా ట్రిప్ తీసుకెళ్లలేదని గొడవ చేస్తున్నారు. ఇలాంటివి అవసరమా.. నేను వినయ విధేయరామ షూటింగ్ లో ఉన్న సమయంలో హేమ సడెన్ గా అమెరికా ఈవెంట్ కు వెళ్ళిపోయింది. ఎవ్వరూ నాకు ఒక్క మాట కూడా  చెప్పలేదు. నేనెవరితో చెప్పుకోవాలి. 

అందుకే ఇలాంటి విషయాలని పక్కనపెట్టి మా సభ్యులని ఆదుకునేందుకు మనమంతా కృషి చేయాలి. ఇలా అనవసరమైన విభేదాలు పెట్టుకుంటే నాకు ఈసీ మెంబర్ పదవి కూడా అవసరం లేదు.. వెంటనే రాజీనామా చేస్తా అని పృథ్వి కామెంట్స్ చేశారు. 

400 సినిమాలకు రచయితగా పనిచేసిన మా గురువు పరుచూరి గోపాల కృష్ణ గారికి కూడా మీటింగ్ లో ఎవ్వ్వరూ గౌరవం ఇవ్వలేదు. ఆగండమ్మా.. గొడవలు వద్దు అని ఆయన అరుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కనీసం ఆయనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.. అందుకే ఆయన కంటతడి పెట్టుకుందో మీటింగ్ మధ్యలోనే వెళ్ళిపోయారు.. నేను కూడా బయటకు వచ్చేశా అని పృథ్వి మా సోసియేషన్ మీటింగ్ లో జరిగిన రసాభాస గురించి వివరించారు. 

మా అసోసియేషన్ బాగుపడాలంటే సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలి అని పృథ్వి కామెంట్ చేశారు. 

click me!