వాళ్ళు ముంబయి నుంచి వస్తారు.. హీరోయిన్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్

By tirumala ANFirst Published Mar 31, 2020, 2:30 PM IST
Highlights

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు ప్రస్తుతం చాలా తక్కువ. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అంతా నార్త్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు హీరోయిన్లు ప్రస్తుతం చాలా తక్కువ. టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లు అంతా నార్త్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లు వారి వ్యక్తిగత కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శ ఉంది. 

గతంలో దాసరి నారాయణ రావు.. టాలీవుడ్ హీరోయిన్లు సినిమా ప్రచారాల కంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కే ప్రాధానత్య ఇస్తారు అంటూ విమర్శించారు. తాజాగా నటుడు బ్రహ్మాజీ హీరోయిన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అకిరా గురించి అతిగా.. రేణు దేశాయ్ రియాక్షన్ అదుర్స్, పవన్ సాంగ్ కోసం తంటాలు!

కరోనా ప్రభావంతో చిత్ర పరిశ్రమ కుదేలైంది. దీనితో సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు 'సీసీసీ మనకోసం' అనే చారిటి సంస్థని ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు హీరోలు, ఇతర సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. కానీ హీరోయిన్ల నుంచి వస్తున్న స్పందన మాత్రం చాలా తక్కువ. ఈ వ్యవహారమే బ్రహ్మాజీకి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. 

బ్రహ్మాజీ మాట్లాడుతూ ' చాలా మంది హీరోయిన్లు ముంబై నుంచి ఇక్కడకు వచ్చారు. స్టార్స్ గా ఎదిగారు. కానీ వారెవరూ సినీ కార్మికుల్ని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రణీత సుభాష్, లావణ్య త్రిపాఠి లాంటి హీరోయిన్లు మాత్రమే స్పందిస్తున్నారు అని బ్రహ్మాజీ మిగిలిన వారిపై గుర్రుగా ఉన్నాడు. 

click me!