''వీడియోలను చూసే జగన్ ని అనుకరించా''

By AN TeluguFirst Published Oct 29, 2019, 3:47 PM IST
Highlights

ఈ క్రమంలో నటుడు అజ్మల్ తను జగన్ ని అనుకరించిన విధానం గురించి చెప్పుకొచ్చాడు. తను ఎప్పుడూ వైఎస్ జగన్ ని కలవలేదని అజ్మల్ చెప్పాడు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ సమకాలీన రాజకీయాల నేపధ్యంలో ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సెన్సేషనల్ అయింది. ట్రైలర్ లో కోలీవుడ్ నటుడు అజ్మల్ హావభావాలు వైఎస్ జగన్ ని గుర్తు చేసేలా ఉన్నాయి.

ఈ క్రమంలో నటుడు అజ్మల్ తను జగన్ ని అనుకరించిన విధానం గురించి చెప్పుకొచ్చాడు. తను ఎప్పుడూ వైఎస్ జగన్ ని కలవలేదని అజ్మల్ చెప్పాడు. అయితే ఈ పాత్రకు తను ఎంపిక అయిన తరువాత వైఎస్ జగన్ కి సంబంధించిన వీడియోలను చూసినట్లుగా చెప్పాడు. అలా ఆయనను అనుకరించినట్లుగా వివరించాడు.

అబద్దాల కోరు.. లీడర్ కాలేడు.. పవన్ పై పూనమ్ కామెంట్స్!

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని.. ప్రస్తుతం పరిణామాల ఆధారంగా రూపొందిందని, నటీనటుల విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. అందులో తను వైఎస్ జగన్ పాత్రకి షార్ట్ లిస్ట్ అయినట్లు.. తను ఆ పాత్రకి సరిపోతానని భావించి ఫైనల్ చేశారని వెల్లడించాడు.

వైఎస్ జగన్ ని ఎప్పుడూ కలవలేదని చెప్పాడు అజ్మల్. నెలకిందట షూటింగ్ మొదలైందని.. తన పాత్రకు మంచి స్పందన వస్తుండడం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. గతంలో కూడా తను 'రంగం' సినిమాలో ముఖ్యమంత్రిగా నటించానని.. ఈ సినిమాలో కూడా ముఖ్యమంత్రి క్యారెక్టరే అని గుర్తు చేశాడు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ గెలిచి, అధికారాన్ని సంపాదించుకున్న నేపధ్యంలో సినిమా సాగుతుందని అన్నారు. 

click me!