
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా పేదలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. రోజు కూలీతోనే జీవనం సాగించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో సంపన్నులు పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వారు కరోనా పోరాటంలో మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. తమ వంతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. మరికొందరు నేరుగా ప్రజలకు సాయం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేదలను ఎంపిక చేసి వారికే సాయం అందించేందుకు ఓ కొత్త పద్దతిని పాటించాడు. నేరు డబ్బులు ఇస్తా అంటూ అర్హులు కాని వారు కూడా వచ్చే అవకాశం ఉందని ఓ ప్లాన్ చేశాడు ఆమిర్. ఏప్రిల్ 23న ఢిల్లీలోని ఓ పేదల కాలనీకి ఓ ట్రక్ వచ్చి ఆగింది. ట్రక్‌లో ఉన్న వాలంటీర్లు ఒక్కో కేజీ ఉన్న గోదుమ పిండి ముద్దులు పేదలకు అంధించటం మొదలు పెట్టారు. అయితే చాలా మంది ఆ కేజీ గోదుమ పిండి మాకు అవసరం లేదని కొందరు వెళ్లిపోయారు.
కనీసం అది కూడా లేని నిరుపేదలు మాత్రమే క్యూలో నిలబడి ఆ పిండిని తీసుకున్నారు. అయితే ఆ పిండి ముద్దల్లో 15 వేల చొప్పున డబ్బులు ఉన్నాయట. ఈ విషయంలో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. అంతేకాదు ఆ ట్రక్‌ను పంపించింది ఆవిర్ ఖాన్ అని కూడా అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆమిర్ మాత్రం ఈ విషయంలో ఇంతవరకు స్పందించలేదు. అంతేకాదు కరోనా విషయంలో తన వంతు సాయం ఇది అంటూ ఇంతవరకు ఏ ప్రకటనా చేయలేదు.