భరించలేకపోతున్న కమెడియన్ పృథ్వి.. సైబర్ క్రైంలో కేసు నమోదు

By tirumala ANFirst Published Apr 28, 2020, 10:13 AM IST
Highlights

నటుడి పృథ్వి టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పృథ్వి కామెడీ టైమింగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ పృథ్వికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

నటుడి పృథ్వి టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. పృథ్వి కామెడీ టైమింగ్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ పృథ్వికి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. కమెడియన్ గా దూసుకుపోతున్న తరుణంలో పృథ్వి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 

గత ఏడాది పృథ్వి వైసిపి పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించాడు. పార్టీ కోసం బాగా పనిచేయడంతో పృథ్వి జగన్ దృష్టిలో పడ్డాడు. దీనితో వైసిపి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పృథ్వికి ఎస్వీబిసి చైర్మన్ పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. 

ఆ పదవి పృథ్వికి మూణ్ణాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలింది. కొన్ని రోజుల క్రితం పృథ్వి ఎస్వీబిసి మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీకై కలకలం సృష్టించింది. ఫలితంగా పృథ్వి తనపదవిని కోల్పోయాడు. పృథ్వి చేతిలో సినిమాలు కూడా లేవు. 

నన్ను చూస్తే నా భర్తకు మూడ్ రాదట.. న్యూడ్ గా చూసి తట్టుకోలేకపోయా,కళ్ళముందే సెక్స్!

ఆ ఆడియో టేపు లీకైనప్పటి నుంచి సోషల్ మీడియాలో పృథ్విపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పృథ్విని ట్రోల్ చేస్తూ టిక్ టాక్, యూట్యూబ్ లలో వీడియోలు చేస్తున్నారు. ట్రోలింగ్ ని భరించలేకపోతున్న పృథ్వి లీగల్ గా యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయ్యాడు. తాజాగా పృథ్వి తనపై ట్రోల్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ లని ఆశ్రయించాడు. 

click me!