CAA Protest: హీరో సిద్ధార్థ్‌పై కేసు..!

Published : Dec 20, 2019, 03:17 PM IST
CAA Protest: హీరో సిద్ధార్థ్‌పై కేసు..!

సారాంశం

చెన్నైలోని చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా గురువారం ఆందోళనలో పాల్గొన్న 600 మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. 

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని చెన్నైలోని వల్లూవర్ కొట్టంలో పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా గురువారం ఆందోళనలో పాల్గొన్న 600 మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

ముఖ్యంగా నటుడు సిద్ధార్థ్, గాయకుడు టిఎం కృష్ణ, విసికె చీఫ్ థోల్ తిరుమావళవన్, వెల్ఫేర్ పార్టీకి చెందిన మొహమ్మద్ గౌస్ ఇందులో ఉన్నారు. సెక్షన్ 143 కింద నిరసనకారులపై కేసు నమోదైంది.

రాజకీయ పార్టీలు, విద్యార్ధి సంఘాలతో సహా 38 గ్రూపులు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినప్పటికీ.. ఆందోళన చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో  పౌరతసత్వ  సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగాయి. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?