''ఇన్నర్స్ చించేసి.. ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ..'' సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ పై దాడి!

By AN TeluguFirst Published Dec 3, 2019, 1:21 PM IST
Highlights

హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ కారుని ముగ్గురు మైనర్లు తమ వాహనంతో ఢీ కొట్టారు. యాక్సిడెంట్ చేసిందే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

రోజురోజుకి మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని చట్టాలు వస్తున్నా, పోలీసు యంత్రాంగం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఈ దాడులను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తాజాగా ఓ సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ పై కొందరు దాడి చేయడం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో సినీ మహిళా ఆర్ట్ డైరెక్టర్ కారుని ముగ్గురు మైనర్లు తమ వాహనంతో ఢీ కొట్టారు. యాక్సిడెంట్ చేసిందే కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడి.. సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఆంటీగా టబు.. పాతికేళ్ల కుర్రాడితో బూతు పాఠాలు!

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆ మైనర్లు తనను ఎంతగా ఇబ్బంది పెట్టారో చెప్పుకొచ్చింది. కారులో ముగ్గురు మైనర్లతో పాటు కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పింది.  వారంతా ఉర్దూలో మాట్లాడుతూ తనపై దాడికి దిగినట్లు చెప్పింది. తన కారు తాళాలు లాక్కోవడానికి ప్రయత్నించారని చెప్పింది.

కారులో ఉన్నవారే కాకుండా మరికొంతమందిని పిలిపించి దాదాపు పదిహేను మంది వరకు వచ్చి దాడికి యత్నించారని చెప్పింది. తన స్నేహితుడు ప్రశ్నించేసరికి అతడిపై దాడికి దిగారని.. అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తన ఇన్నర్స్ చించేశారని చెప్పింది.

కొందరు అమ్మాయిలు తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చింది. పదిహేను మంది ఒకేసారి ఎటాక్ చేశారని..  తన స్నేహితుడిని కూడా కొట్టారని తెలిపింది. పోలీసులను ఫోన్ చేసినప్పటికీ చాలా ఆలస్యంగా స్పందించారని తెలిపింది. 
  

click me!