ఆంధ్రాలో వేడిగా పప్పు రాజకీయం

 |  First Published Apr 18, 2017, 1:36 PM IST

 

అధ్యాయం 1

Latest Videos

undefined

Who is pappu in Andhra Pradesh?

 Who is pappu  in India?

Who is lady pappu of BJP?

ఇవన్నీ తుంటరి ప్రశ్నలని తీసేయకండి?

పప్పంటే ఇష్టపడని వాళ్లెవరు? రాష్ట్రానికోరకం పప్పు ఉన్నట్లు తెలుసు. అట్లాగే పార్టీ కొక పప్పు ఉండవచ్చుగదా.

వీటికి జవాబు కనుక్కోవాలంటే...గూగుల్ లో సర్చ్ చేసి ,సరదాగా నవ్వుకోండి.

 

అధ్యాయం 2

 

సోషల్ మీడియా ఏపుగా పెరిగి అన్ని వైపులా వ్యాపించినవూడల మర్రి,.

దాని అదపుచేయడం కష్టమే. ఆంధ్ర రాజకీయాలలో ఈ మధ్య ఈ పప్పు వివాదం రాజుకుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశాల మధ్య చాలా టెన్షన్ కు కారణమయింది. పప్పు... పప్పు... పప్పు. కొన్ని వందల పోస్టులు ఈ  పప్పు మీద.

 

 

అధ్యాయం 3

 

ఈ పప్పుగొడవ వదిలేద్దాం.

ఈ మధ్య తెలుగుదేశం యువరాజా వారికి సోషల్ మీడియా మీద ఆగ్రహం వచ్చింది. సోషల్ మీడియా పౌరుల మీద కేసులు పెడతామని కూడా బెదిరించారు.

 ఆ బెదిరింపు తీసుకుని ఒక అరవ ప్రతికాయన పేద్ద  న్యూసే రాసేశారు.

యువరాజా వారు  మంత్రి కావడానికి శాసనమండలిని ఎన్నుకున్నారు.

అప్పటినుంచి ఆయన తెలుగు  నెటిజన్లకు నిరాటంకంగా నవ్వులు పండిస్తూనే ఉన్నారు.

ఎన్నిక కావడం...ప్రమాణ స్వీకారం రోజు శ్రద్ద తో అని చదవాల్సిన చోట శ్రద్దాంజలి అనడం.మొన్న అంబేడ్కర్ జయంతి రోజున వర్ధంతి శుభాకాంక్షలు అని  మంత్రి నవ్వులు పూయించారు.

 

ఇవే కాకుండా ఎన్నికల ప్రచార సభల్లో అవినీతి,కులపిచ్చి ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం అనడం...మరో సభలో సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరేసుకున్నట్లే అనడం అవులయ కాదు, సీరియస్.

 

అన్నింటినీ మించి ఈ రోజు రాబోయే రెండేళ్లలో ప్రతి పల్లెలో తాగునీటి ఇబ్బంది ఏర్పాటు చేయడం మా పార్టీ లక్ష్యం అని వారీరోజు తెలుగు నాట పకపకలు పండించారు.

 

అధ్యాయం 4

 

ఇక గూగుల్ లో ఏపి పప్పు అని టైప్ చేసి ఇమేజెస్ చూస్తే ఎన్ని రకాల పప్పులొచ్చాయో చూడండి. అందులో రాజకీయ పప్పులుంటే వాటి గురించి కామెంటు పెడితే మేం కూడా నవ్వుకుంటాం

 

 అద్యాయం 5

ఇటీవలి కాలం లో ఏ అనుమానాలనైనా తీర్చుకునేందుకు కోరా సైట్ కు వెళ్తుంటారు.

అదినెటిజన్ల నాలెడ్జి అడ్డా గా మారింది.

ఈ మధ్య అక్కడ కూడా  పప్పు గురించి డిబేట్ జరిగింది.

సింపుల్ ప్రశ్న,  హూ ఈ జ్  పప్పు ఇన్ ఆంధ్రప్రదేశ్ ?

 

సమాధానం: ఆంధ్రలో రెండురకాల పప్పులుంటాయి..ఒకటి ముద్దపప్పు మరొకటి ఏపీ పప్పు అని ఒక  ఫోటో పెట్టి ఏమీ తెలియకున్నా సర్వం తెలిసినట్టు డంబాలు చూపుకునేవారిని ఇలాంటి పప్పు అంటారని సమాధానాలు ఇచ్చారు. టూ మచ్, యార్.

 

ఇంత జరిగాక,  త్వరలో జరగబోయే  గ్రూప్-1,సివిల్ సర్వీసుల్లాంటి జటిలమయిన పోటీ పరీక్షల్లో పప్పు ఎవరు అనే ప్రశ్న ఉండబోతుందా అని సీరియస్ అడుగుతున్నవాళ్లూ ఎదురుపడుతున్నారిపుడు.

 

 

 

 

click me!