ముసలి ములాయం - అల్లరి అఖిలేశ్... రక్తి కడుతున్న నాటకం

 |  First Published Jan 17, 2017, 8:51 AM IST

 

ఉత్తర ప్రదేశ్ యాదవ పరివారంలో గత నాలుగైదు నెలలుగా రంజుగా సాగుతున్న నాటకం ఇప్పుడిక క్లైమాక్స్ కి చేరుకొంది.

Latest Videos

undefined

 

 "పార్టీ పేరు & పార్టీ గుర్తైన సైకిల్" ఈ రెండిటినీ ఎన్నికల్లో వాడుకొనే అధికారం - హక్కు "అఖిలేశ్ యాదవ్ కి మాత్రమే ఉందని" నిన్న కేంద్ర ఎన్నికల సంఘం తీర్పునిచ్చింది. పర్యవసానంగా సమాజ్ వాది పార్టీ ప్రధాన కార్యాలయంలో "అఖిలేశ్ యాదవ్" పేరు ప్రక్కన "పార్టీ అధ్యక్షుడు" అన్న కొసరు వచ్చి చేరింది. 

 

 ఈలోపు, సమాంతరంగా మరో నాటకాన్ని ముదుసలి తండ్రి  "ములాయం సింగ్ యాదవ్" రక్తికట్టించారు. "అఖిలేశ్ యాదవ్ ముస్లిం వ్యతిరేకి" అంటూ తీవ్రమైన ఆరోపణలు(?) చేశారు. ముస్లిం వ్యతిరేక ధోరణి మార్చుకోకపోతే ఏకంగా కొడుకుపైనే పోటీ చేస్తాననీ(?) హెచ్చరించారు (అచ్చం చంద్రబాబు ఎన్‌టి‌ఆర్ పై పోటీ చేస్తానన్నట్లుగా). 

 

అంతేకాకుండా, ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని డి‌జి‌పి గా నియమించాలని అఖిలేశ్ కు సూచిస్తే, 15 రోజులు అఖిలేశ్ ఈ ముసలి తండ్రితో మాట్లాడలేదట.! ఎందుకంటే ఒక ముస్లిం వ్యక్తికి డి‌జి‌పి పదవి ఇవ్వడం అఖిలేశ్ కు ఇష్టం లేదట - భలే భలే..!!

 

ఏమి నాటకాలివి ..

 

 ఐనా, పాలనా విషయాల్లో ఈయన జోక్యం చేసుకోవడమేమిటి ? ఎవరిని నియమించాలో అంతా ముఖ్యమంత్రి ఇష్టం కదా !

 

 సరే, జ్యోక్యం చేసుకొన్నాడే అనుకొందాం, ఇలా దానికీ రాజకీయానికీ లింక్ పెట్టి ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడమేమిటి అసహ్యంగా ?? వినేవాడు వెధవ అయితే చెప్పేవాడు ఖచ్చితంగా మేధావే మరి!

 

ఇక్కడితో ముగిస్తే బాగుండేది... మరో సెంటిమెంటు డైలాగ్ గుమ్మడి నాన్న తరహాలో వల్లెవేశాడు. "నేను ముస్లీముల కోసమే బ్రతుకుతున్నాను – వారి కోసమే మరణిస్తాను" ముస్లీం ప్రయోజనాలకోసం కొడుకుతో పోరుకైనా సిద్ధమే" అంటూ భారీ డైలాగ్ పేల్చాడు  - ఏ ప్రకటన వెనక ఏ ప్రయోజనం దాగిఉందో ఎవ్వరికీ అర్థంకాదన్న అతినమ్మకం కాబోలు. - ఇలాంటి నాటకాలు అర్థంచేసుకోలేని ప్రజలు ఉన్నంతకాలమూ వీళ్ళ నాటకాలు సాగుతూనే ఉంటాయి. 

 

మొన్నటికి మొన్న ఇదే పెద్దమనిషి ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకోండి. ఎంతైనా నాకొడుకే కదా, ఇలా చేస్తే నేను మాత్రం ఏంచేస్తాను చెప్పండి ? మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్తి "అఖిలేశే" అంటూ గడుసు వ్యాఖ్యలు చేశాడు.

 

బి‌జే‌పి ని దెబ్బతీసి, ఎలాగైనా వారిని అధికారంలోకి రానీయకుండా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో, ఆగస్ట్ 2016 లో మొదలైన ఈ నాటకం, తండ్రీ కొడుకులు పక్కా ప్రణాళిక ప్రకారమే నడిపిస్తున్నారన్న సంగతి, రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. దీనికి వాళ్ళు చూపించిన కారణాలన్నీ కేవలం నాటకంలో భాగమే. 

 

బేసిగ్గా చెప్పాలంటే, ఉత్తర ప్రదేశ్ లో శాంతిభద్రతల పరిస్తితి ఏమీ బాలేదు. తన పాలనాకాలంలో కొన్ని అభివృద్ధికార్యక్రమాలతో జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి పాజిటివ్ ఇమేజ్ ను అఖిలేశ్ సంపాదించుకొన్నా, గ్రామీణప్రాంతాల్లో పరిస్థితులు పార్టీకి అంత అనుకూలంగా లేవు. దీనికి తోడు పార్టీకి వెనుదన్నుగా ఉన్న ముస్లీం ఓటు బ్యాంకును చీలకుండా చూసుకోవడం పార్టీకి అత్యవసరం. - దీనికి పక్కా ప్రణాళికతో కూడిన నాటకానికి తెరతీశారీ తండ్రీకొడుకులు. 

 

 

ఇక, పార్టీ సింబల్ తనకే అని కన్ఫర్మ్ అయ్యాక, అఖిలేశ్ పావులు మరింత వేగంగా కదులుతున్నాయి. బి‌జే‌పి వ్యతిరేక కూటమిని ఏర్పాటుచేయడంలో చాలా దూకుడుగా వెళుతున్నాడు అఖిలేశ్. ప్రధానంగా "కాంగ్రెస్ - ఆర్‌ఎల్‌డి - ఎన్‌సి‌పి" లతో కలిపి ఒక కూటమిని ఏర్పాటుచేసేదిశగా ప్రణాళికలు సాగుతున్నాయి. ఈ కూటమిలోకి మరిన్ని పార్టీలు చేసినా ఆశ్చర్యం లేదు. 

 

.... అబ్బా కొడుకులు ఆడుతున్న ఈ నాటకంలో రెండువైపులా పదునున్న కత్తితో సవారీ చేయాలన్న వ్యూహమే కనిపిస్తుంది! 

 

ఇద్దరూ ఇరు కూటములతో పోటీ చేసి, ఒక కూటమిని వద్దనుకొనేవాళ్ళు బి‌జే‌పి వైపుకు వెళ్లకుండా మరో కూటమి లాక్కొంటుది. ఏరకంగా చూసినా, తండ్రీ కొడుకుల మధ్యలోనే ఓట్ల బదిలీ జరగాలన్నది మాస్టర్ ప్లాన్. - దీనికి తీవ్రమైన ఆరోపణాలూ - పార్టీ నుండి సస్పెన్షన్ లూ - అధ్యక్షుడిని తప్పించడాలూ(?) - పార్టీని చీల్చడాలూ(?) ఇలా పూటకో నాటకం అన్నమాట!

 

అఖిలేశ్ తన తండ్రిని తప్పించి, పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకోవడం ద్వారా పెద్ద నాయకుడిగా అవతరించాడు - అలాగే ములాయం మీద సానుభూతి అమాంతం పెరిగింది. వీటన్నిటి మధ్యన అధికారపార్టీపై సహజంగా ఉండే "యాంటీ ఇన్కమ్బెన్సీ" ని సాధ్యమైనంత తగ్గించడం మరో కోణం.

అటు తండ్రి కొడుకుపై చూపించే ప్రేమ - ఇటు కొడుకు తండ్రిపై చూపించే గౌరవం వెరసి, "సకుటుంబ సపరివార చిత్రాన్ని" తలపిస్తూంది ఉత్తరప్రదేశ్ రాజకీయం.

 

ఒక్కటిమాత్రం నిజం "వినేవాడు తింగరోడైనంతవరకూ - చెప్పేవాడు ఖచ్చితంగా మేధావే" - "జనాలు గొఱ్రెలైనంత వరకూ - రాజకీయులు దైవాలే.”

 

అన్నిటికంటే ఆశక్తికరమైన అంశం ఏమిటంటే, "అఖిలేశ్ తరఫున ఎన్నికల సంఘం వద్ద వాదించింది కరడుగట్టిన కాంగ్రెస్ నేత, మాజీ న్యాయ శాఖ మంత్రి అయినా "కపిల్ సిబల్".. కళ్ళు తెరవాల్సింది మనమే. !!

 

click me!