undefined
చరిత్రకారులెప్పుడూ విజేతలు చెప్పిన విషయాన్నే చరిత్రగా రాస్తారన్నదానికి ఉదాహరణ జయలలిత సినీరంగ ప్రవేశం.కన్నడ దర్శకుడు బి.ఆర్.పంతులు 2 నెలల్లో షూటింగ్ ముగిస్తానని చెప్పి చిన్నదగొంబె(నవంబర్1965 విడుదల) లో అవకాశం ఇచ్చాడు,ఆ తర్వాత తెలుగు మనుషులు మమతలు(ఆగస్ట్ 1965) అవకాశాలు వచ్చాయి..ఇక వెనుతిరిగి చూడలేదంటారు.కానీ... మన ఆదుర్తి సుబ్బారావు గారు అంతా కొత్త తారలతో నిర్మించిన తేనెమనసులు(మార్చ్ 1965) కోసం స్క్రీన్ టెస్ట్ చేసి నిరాకరించిన తారల్లో జయలలిత,డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ఉన్నారు.
ఇంకో పచ్చి అబద్దం చూడండి పోయస్ గార్డెన్స్ లో ఇల్లు జయలలిత తల్లిగారు 1.32 లక్షలకు కొన్నారట!మరి ఇంటి పరిస్థితులు దుర్భరంగా ఉన్నందున బలవంతంగా సినిమాల్లోకి రావాల్సి వచ్చొందని ఇంటర్వ్యూల్లో ఉంటుంది.ఒకవేళ జయ సొంతసంపాదనతో కొని ఉండొచ్చంటారా?అప్పటికీమె సినిమాల్లోకొచ్చి ఏడాది అయుంటుంది...అప్పటి అగ్రనటులు యన్ టీఆర్,ఏఎన్నార్,శివాజి,యంజీఆర్,జెమినీల పారితోషికమే మహా అంటే 20-25 వేలుండొచ్చు.మరి ఏడాదిలో ఇంత ఈవిడ సంపాదించిందా?లేక కుటుంబంలో దుర్భరపరిస్థితులన్నది అబద్దమా?
సరే ఏదైతేనేం రెండుభాషల్లో తొలిసినిమాలు హిట్ కొట్టాయి.తెలుగు సినిమాలో స్విమ్‌సూట్ లో కనిపించి అందాలు ఆరబోసింది.తొలి తమిళ సినిమా వెన్నిరాడై(తెల్లచీర)లోనూ రవికలేకుండా జలపాతం కింద పాట పాడుతూ కనిపించింది.అన్నట్టు ఈ సినిమాలో ఈవిడ పెళ్లైన కొత్తల్లోనే భర్తను పోగొట్టుకుని గతాన్ని మరచినావిడగా నటించింది.
ఈవిడ చికిత్స కోసం అప్పటికే ప్రేయసి ఉన్న ఒక మానసికవైద్యుడు ఈవిడుంటున్న హిల్ స్టేషన్ కు రావడం,ఆవిడకు నయమై ఈయన్ను ప్రేమించడం,చివరికి తెలుసుకుని తెల్లచీరతో వెళ్లిపోవడం.ఇలాసాగే ఈ సినిమాలో డక్టర్ ప్రేయసిగా నటించిన నటి,మరో హాస్యనటుడికి ఇంటిపేరు వెన్నిరాడై అయింది.అతను వెన్నిరాడై మూర్తి,ఆవిడ వెన్నిరాడై నిర్మల(ఇప్పటి తరంకు చెప్పాలంటె మహేష్ బాబు అర్జున్ లో మేనత్త).
ఈ బాధలు ఇలా ఉంటే ఈవిడ ఏకైక హిందీ సినిమా ఇజ్జత్ లోనూ అరాకొరా బట్టల ఆదివాసీ అమ్మాయి.ఇక్కడ నీళ్లలో అయితే అక్కడ కులుమనాలి లో తీసారు.
ఏదైతేనేం మొత్తానికి గ్లామర్ పాత్రలకు చిరునామా అయింది.ఈలోగా అప్పటి అగ్రనటుడు యం.జీ ఆర్ కంట పడింది.(నిజానిజాల సంగతి తెలియదు కానీ జానకి కన్నా ముందు చనిపోయిన భార్య పోలికలున్నందున జయ ను అభిమానించాడని మణిరత్నం ఇద్దరు సినిమాలో చూపించాడు)
అంతవరకూ యం.జీ.ఆర్,బి.సరోజాదేవిలది హిట్ కాంబినేషన్,కలిసి 26 సినిమాల్లో నటించారు.ఇద్దరూ కలిసి అడిమైపెణ్(బానిసపిల్ల)సినిమాలో నటించాల్సి ఉంది,ఫోటో సెషన్ జరిగింది.ఈలోగా సరోజాదేవి పెళ్లిచేసుకోబోతున్నా అని ప్రకటించింది.కినిసిన యం.జీ.ఆర్ ఆవిడ స్థానంలో జయలలితను తెచ్చాడు.ఆ తర్వాత 1973 వరకు వీరిద్దరూ కలిసి 28 సినిమాల్లో నటించారు.ఆ తర్వాత జయలలిత స్థానాన్ని మంజుల,లత(అందాలరాముడు,నిప్పులాంటిమనిషి ఫేం)భర్తీ చేసారు.
నిజానికి ఈ ముగ్గురికీ హీరో గారికి 30ఏళ్ల పైబడిన వయసు వ్యత్యాసం ఉంది.యం.జీ.ఆర్ సినిమాల్లో పొగ,మందు తాగే సీన్లు ఉండవని అభిమానులు చెప్పుకుంటారు కానీ హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనకేం తక్కువుండదు.ఆయనకు జాతీయ ఉత్తమనటుడు అవార్డ్ వచ్చిన రిక్షాకారన్ లో మంజుల చీరలేకుండా ఒకపాటలో నటించింది.ఇక లత,రాధసలూజ(యన్.టీ.ఆర్ టైగర్ లో నటించింది)తో కొన్ని పాటలు అత్యంత అసహ్యకరంగా ఉంటాయి.ఇక ఈ మంజుల,లత ల కాలంలోనే జయలలిత,శోభన్‌బాబుల ప్రేమాయణం నడిచింది.
అసలు యం.జీ.ఆర్ తన హీరోయిన్లపై ఎంతలా పెత్తనం చలాయించేవాడంటే...అప్పట్లో మన రజనీబాబాకు ఎవరో బాబా లత అన్న పేరున్నావిడతో లక్కు కలిసొస్తుందన్నాడట..మనోడు లతను గోకాడు..పెద్దాయన వీపు పగలగొట్టించి చుక్కలు చూపించాడు.(ఆ తర్వాత ఆయన అర్ధాంగి పేరూ లత కావడం ఒక వింత).
సరే మళ్లీ జయలలితను చేరదీసాడు.నిన్నామొన్న వస్తున్న వార్తలప్రకారం దాసరి తీసిన కన్య-కుమారి సినిమాకు జయను ముందుగా అనుకుంటే పెద్దాయన ఫోన్ చేస్తే ఆవిడ బదులు శ్రీవిద్య కు అవకాశం ఇచ్చానన్నాడు.అలాగే ప్రముఖనటులతో జంతువులకు ప్రాధాన్యతనిచ్చి సినిమాలు తీసే డెవర్ సంస్థ ఆవిడ స్థానంలో కె.ఆర్.విజయ ను పెట్టి(రజనీకాంత్ అక్కగా) రంగ సినిమా తీసారు.
1982 లో పార్టీలో చేరిన జయ ప్రచారకర్తగా ఉండేది.1984లో రాజ్యసభ సభుయురాలిని చేసారు.ఇక 1987 లో యం.జీ.ఆర్ మరణం శవం పక్కనుంచి ఆవిడను లాగెయ్యటం,ఆ తర్వాత 1989 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో దుశ్శాసన పర్వం తెలిసిందే.
(ముగింపు రేపు)