ఉచితం ... రాజకీయ కుతంత్రం

 |  First Published Dec 9, 2016, 2:20 AM IST

గరీబీ హటావో , పేదరికం పారద్రోలండి ఇందిరా గాంధి కి ఓట్లు కురిపించిన నినాదం. వెర్రి జనాలు నిజంగా పేదరికం పోతుంది అని నమ్మారు అనుకోండి.


వెనిజులా లో ప్రపంచం లో కెల్లా అత్యంత ఎక్కువ ఆయిల్ నిల్వ లు ఉన్నాయి , సౌది అరేబియా కంటే ఎక్కువ, కాబట్టి జీవన ప్రమాణాలు బాగా ఉండాలి కదా.

Latest Videos

undefined


అవి హ్యూగో చావెజ్ వెనెజులా ని జన రంజకం గా పాలిస్తున్న బంగారు రోజులు. అన్నీ అందరికీ ఫ్రీ, ఉచిత మైక్రో వేవ్ఆవెన్ లు,ఉచిత మందులు, ఉచిత పాలు, ఉచిత తిండి. నీళ్ళ కంటే తక్కువ ధర కి పెట్రోల్ , ఉచిత కార్ లు, ఉచిత బైక్ లు, ఉచిత హెల్త్ కేర్, ఇలా అన్నీ ఉచితమే. చివరికి టాయిలెట్ పేపర్ కూడా ఉచితమే.


ఇలా పొద్దున్న నిద్ర లేచి మొహం కడుక్కుని కూర్చుంటే చాలు, ప్రభుత్వం అన్నీ ఉచితం గా తెచ్చి నమిలి నోట్లో పెడుతుంది. ఎలాగూ ప్రభుత్వం ఉచితం గా పెడుతున్నది కదా అని అందరూ కూర్చుని తిని పొట్టలు పెంచే వాళ్ళు, వ్యవసాయం పూర్తిగా మానేశారు, ఎవరు కష్ట పడతారు అనవసరం గా అని.


ఆయిల్ బారెల్ వంద పైన ఉన్నప్పుడు బానే ఉండింది. ఇప్పుడు ఆయిల్ కూల బడింది. ఈ రోజు పరిస్థితి ఏమిటో తెలుసా? వెనిజులా కరెన్సీ కి టాయిలెట్ పేపర్ కి ఉన్న విలువ లేదు. తినడానికి తిండి లేదు, మందులు లేవు, ఇంఫ్లేషణ్ పదిహేను వందల పర్సెంట్ కి పోయింది. తిండికి లేక ఒకళ్ళని ఒకళ్ళు చంపుకుంటూ ఉన్నారు. క్రైం రేటు విపరీతం గా పెరిగిపోయింది.


ఉచితం గా తినడానికి అలవాటు పడ్డ ప్రజలు ఇప్పుడు ఒక్క సారి కష్ట పడాలి అంటే ఒప్పుకోవడానికి సిద్ధం గా లేరు. వోటు వేసాం గా ఎవడి కోసం పెట్టవు , పెట్టు అంటున్నారు. వెనిజులా ఇప్పుడు పూర్తి అంతర్యుద్ధం లో పడిపోయింది.


జనరల్ గా అభివృద్ధి చెందిన దేశాలు, అవి ఎంత ధనం ఉన్నా సరే, ఆ డబ్బు ని ఉచితం గా పంచవు. నేషనల్ వెల్త్ ఎప్పుడూ భవిష్యత్తు తరాల కోసమే. అవి జాతీయ సంపద చచ్చినా యూజ్ చెయ్యం అనే ఫిలాసఫీ మీద ఉంటాయి. అందుకే  అభివృద్ధి చెందిన దేశాల్లో ఏవీ ఫ్రీ గా ఉండవు, వాళ్ళ డబ్బు ని వాళ్ళు జాతి మీద పెట్టుబడి గా వాడుకుంటారు.మనకు మాత్రం ఈ పూట  గడవడమే ముఖ్యం.


మన దేశంలో నాయకులు అందరూ ఉన్న డబ్బు ని భావి తరాల కోసం వాడకుండా ప్రజలకు పంచి పెట్టే అనేక స్కీం లు పెట్టి ఉన్న కొంచెం సొమ్ము వోటు బాంక్ లకి వాడుకున్నారు. దాని పుణ్యమా అని ఎకానమీ పూర్తి గా దెబ్బ తినింది. ఉదాహరణ కి తమిళ నాడు , ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ల ఆర్ధిక వ్యవస్త లు దివాలా అంచున ఉన్నాయి.మన మూడు రాష్ట్రాల స్కీం లు కేస్ స్టడీ ల లాగా చూద్దాం.

 

తమిళ నాడు : ఇక్కడ రూపాయి కి ఇడ్లీ, పెళ్లి చేసుకుంటే నాలుగు గ్రాముల బంగారం, యాభై వేల రూపాయలు డబ్బు, ఉచిత లాప్టాప్ లు, గ్రైండర్, మిక్సీ , టేబుల్ ఫాన్, ఉచిత మొబైల్ ఫోన్ లు, చివరికి ప్రభుత్వమే కేబుల్ టివి కూడా నడుపుతున్నది. వీటన్నిటి కీ డబ్బు కావాలి, డబ్బు చెట్లకి కాయదు. తమిళనాడు ధనిక రాష్ట్రం అయినప్పటికీ ఈ స్థాయి ఉచిత పధకాలకి డబ్బు సమకూర్చడం అసాధ్యం. గత ఐదు సంవత్సరాలలో తమిళనాడు అప్పు 92 శాతం పెరిగి రెండు లక్షల కోట్ల కి చేరింది. ప్రభుత్వ పన్ను ఆదాయం ఈ అప్పు కి వడ్డీ కట్టడానికే సరిపోవడం లేదు.

 

ఆంధ్ర ప్రదేశ్/తెలంగాణా :ఇక్కడ ఆరోగ్యశ్రీ, ఫీజు రీ ఇమ్బర్సుమేంట్, పెళ్లి అయితే డబ్బు, రుణ మాఫీ లు , రూపాయి బియ్యం, 2బిహెచ్ కె ఇలా లెక్కకి మించిన పధకాలు ఉన్నాయి. ప్రపంచం లో ఎక్కడా లేని విధం గా ఉన్నత విద్య కి ప్రభుత్వమే ఫీజు కట్టి ప్రైవేటు కాలేజి లో చేర్పిస్తుంది. ప్రభుత్వమే తన వ్యవస్థలు పనికి రానివి అని చెప్పి ప్రైవేటు ఆసుపత్రికి డబ్బు కట్టి చికిత్స చేయిస్తుంది.

 

 ఇవి నిజానికి ప్రజల పన్ను డబ్బు ని ప్రైవేటు కార్పోరేట్ హాస్పిటల్ మాఫియా, కాలేజి మాఫియా ల బాలన్స్ షీట్ లలోకి మార్చే పెద్ద స్కాం. గత ఎనిమిది సంవత్సరాలు గా వేల కోట్లు ఇలా తరలించారు. ఉచిత విద్య పుణ్యమా అని చదువు క్వాలిటీ తగ్గిపోయి, ఉద్యోగాల కి పనికి రాని విద్యావంతులు తయారు అయ్యారు. వీళ్ళలో చాలా మంది టాక్సీ లు నడుపుకుంటున్నారు. ఈ రెండు రాష్ట్రాలు ఆర్ధికం గా అంత బలమైనవి కాక పోవడం తో అప్పు చేసి తెచ్చి ఈ స్కీం లు నడుపుతున్నాయి.

 

ఇప్పుడు రెండు రాష్ట్రాల అప్పు భారం రెండు లక్షల పాతిక వేల పై చిల్లర కోట్ల రూపాయలు. ప్రభుత్వాల దగ్గర కనీసం రోడ్ లు వెయ్యడానికి కూడా డబ్బు లేదు.అందుకే రోడ్ లు అన్నీ గోతులతో నిండి పోయాయి. ప్రభుత్వం ఏమీ చెయ్యలేక చూస్తూ ఉండి పోతున్నది.

 

ఉచిత పధకాలు ఎల్ల కాలం సాధ్యం కావు. గరీబీ హటావో కూడా ఎన్నటికీ సాధ్యం కాదు. ఇప్పటికి అయినా కళ్ళు తెరవకుంటే మన మూడు రాష్ట్రాలు వెనిజులా లా మారడానికి ఎక్కువ సమయం లేదు.

 

click me!