తెలంగాణ ఎన్నారై ఆవేదన ఇది.
తెలంగాణ ప్రభుత్వము & తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి మరో తెలంగాణ ఉద్యమకారుడు అయూబ్ ఖాన్ ను బలి తీసుకున్నాయి. తెలంగాణ రాకముందు ఉద్యమకారులను రెచ్చగొట్టి ఆత్మహత్యల వైపు పురికొలిపి వందల మంది ఉద్యమకారులను బలితీసుకుండ్రు. తెలంగాణ వచ్చినంక ఒకప్పుడు తెలంగాణవాదులను తరిమి తరిమి కొట్టిన వారిని అందలమెక్కిస్తుంటే లక్షల మంది ఉద్యమకారులు తల్లడిల్లిపోతున్నరు. పనిచేసిన ఉద్యమకారులకు గుర్తింపు రాకపోవడంతో తన నిరసనను బాహ్య ప్రపంచానికి చాటేందుకు ఆయన గత నెల 30వ తేదీన మంత్రి మహేందర్ రెడ్డి సాక్షిగా ఒంటిపై గ్యాస్ నూనె పోసుకుని అంటించుకున్నడు అయూబ్ ఖాన్ అనే ఉద్యమకారుడు. మూడు వారాల పాటు హైదరాబాద్ లోని డి ర్ డి ల్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కోలుకోలేక తది శ్వాస విడిచిండు. తెలంగాణ ఉద్యమకారుడు అయూబ్ ఖాన్ కు నివాళులు అర్పిస్తున్నాను.
undefined
అయూబ్ ఖాన్ ఉద్యమములో చాల చురుకైన పాత్ర పోషించిండు. తోటి ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆహుతి ఐనాడు అయూబ్. ఉద్యమము పేరు మీద నాడు వందలమందిని బలితీసుకున్న ఈ కుటుంబము నేడు బంగారు తెలంగాణ పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టి ఉద్యమకారులపై దాడి చేయిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నది. అలాంటి నిఖార్సైన ఉద్యమకారులను మల్లా ఇంకోసారి ఆత్మహత్యల వైపు మళ్లిస్తున్నది. ఆ పరిణామ క్రమంలో బలైన అమరుడే మన అయూబ్ ఖాన్.
నాడు స్వరాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండ అనేక మంది ఉద్యమకారులు ఉద్యమాన్ని ముందుండి నడిపినారు వాళ్ళందరిని పక్కనబెట్టి , తెలంగాణ ఉద్యమము ఎక్కడుందిరా అని బెదిరించిన తీగల మీకు సుట్టమైండు. మహానాడు సభ లో జై తెలంగాణ అన్న ఉడమకారులను తరిమి తరిమి కొట్టిన మహేందర్ రెడ్డి ని మంత్రిని చేసినవు. మీ నాలుక కోస్తా అన్న తలసానిని సంకనబెట్టుకున్నవ్. జై తెలంగాణ అని పలకడం కూడా రాని తుమ్మల రావును కుడి భుజమన్నవ్. ఉమ్మడి రాష్ట్రంలో కాయితాలు తిని ఇప్పుడు ఇసుక బుక్కుతున్న పోచారాలకు మంత్రి పదవులు కట్టబెట్టినవ్. తెలంగాణ రాష్ట్రాన్ని ఇందుకోసమేనా సాధించుకుంది అని ఉద్యమకారులు అనుక్షణం తీవ్ర మనోవేదన చెందుతున్నారు కదా పెద్ద మనిషీ మీ వల్ల.
అయూబ్ ఖాన్ మరణించడంతో తెలంగాణ కోసం కష్టపడి పనిచేసిన ఉద్యమకారులంతా బోరు బోరున విలపిస్తున్నరయ్యా కెసిఆర్ గారు. మీ నిరంకుశ పాలనా అంతమయ్యే రోజులు దగ్గరలోనే వున్నాయి. ఉద్యమకారులు, యువకులు, నిరుద్యోగులు మరో ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికైనా మేలుకో. తెలంగాణ జనాలు ఏం కోరుకుంటున్నరరో తెలుసుకో. ఎప్పుడు ఏదో ఒక కొట్లాట పెట్టి సలి మంటలు కాగుత అనుకుంటే పొరపాటే. ఏదో ఒకరోజు ఆ మంటలు మీకు కూడా అంటక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.
ఇట్లు...
కొంపల్లి శ్రీనివాస్,
తెలంగాణ ఎన్నారై,
ఫోన్. +1 309 258 1286.
(రచయిత కొంపల్లి శ్రీనివాస్. నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన తెలంగాణ ఎన్నారై)
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి