బతుకమ్మ చీరెలు కాల్చేటోళ్లకు జవాబు ఇదిగో...

 |  First Published Sep 19, 2017, 5:29 PM IST

‘పెద్దమ్మా.... నువ్వు తగ్గొద్దు... ఇట్లనే గరం గరం మాట్లాడు...

కేసీఆర్ గంత పెద్దింట్ల ఉంటడు... నీకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లా... కూల గొట్టేయ్...

Latest Videos

undefined

కేసీఆర్ ఇంటి ముందర 200 ఫీట్ల రోడ్ ఉంది... నీ ఇంటి ముందు 20 ఫీట్ల రోడ్ ఏస్తడా... తవ్వి పారెయ్...

కేసీఆర్ రోజూ గాలి మోటార్ల పోతడు... నీకు ఆర్టీసీ బస్సా... తగలబెట్టేయ్...

కేసీఆర్ మస్తు ఫిరం ఫిల్టర్లల్ల నీళ్ళు తాగుతడు... నీకు భగీరథ నల్లాలల్ల నీళ్ళా... ఇరగ్గొట్టేయ్...

కేసీఆర్ ఇంట్ల మనుషులు మంచి తిండి తింటరు... నీ పిల్లలకు బళ్ళె మద్యాన్నం సన్నన్నం బువ్వనా... ఇన్ని రాళ్ళెయ్యి...

కేసీఆరుకు లచ్చ జీతం... నీకు నెలకు ఎయ్యి రూపాల ఫించనా... నిలదియ్యి...

కేసీఆర్ బిడ్డలు పెద్ద పెద్ద బళ్ళెకు పోతరు... నీ కొడుకులకు గురుకుల బళ్ళా... మూసేయ్యమని గాయి గాయి చెయ్...

కేసీఆరుకు పొలంల కొత్త కొత్త తరీకల ఎవుసం చేస్తండు... నీకు మాత్రం రుణ మాఫీ, గ్రీన్ హౌస్, ఎరువులకు సబ్సిడీ, ఎకరానికి 8 వేలా... మొహాన కొట్టెయ్...

కేసీఆర్ పొలంల మస్తు బావులు ఏశిండు... నీకు మాత్రం మిషన్ కాకతీయ, చెరువులు అంటాండు... ఇంత మట్టెయ్యి...

కేసీఆర్ పొలంల కాలు అడ్డం పెడితే నీళ్ళు... నీకు 24 గంటలు పైసల్లేకుండ కరెంటు ఇస్తాంటాండు... మోటార్లు కాలపెట్టేయ్...

కేసీఆర్ కొడుకు, బిడ్డల పెళ్ళిళ్ళు ఎట్ల చేశిండు... నీకు మాత్రం 75 వేలిస్తడా... ఏ మూలకు పోతయ్...’

ఇట్లా మోకాళ్లను, అరికాళ్ళను గోకితే వచ్చిన తెలివితో రాజకీయ నాయకులు నీకు మస్తు చెప్తరు... నువ్వు కొంచెం ఆలోచన చెయ్యి.... ప్రతీదీ కేసీఆర్ కుటుంబానికి ఉన్నట్టే కావాలంటే అది ఏ ప్రభుత్వానికి అయ్యే పని కాదు... అయినా కేసీఆర్ కుటుంబం లెక్క నీ బిడ్డలు బతకాలనే కోరిక మాత్రం వదులుకోకు... ఫించనుతో బతుకు భారం తీర్చుకో... భగీరథ మంచినీళ్ళతో బిందెల మోత తప్పించుకో... సర్కారు దవాఖానల పెయ్యి బాగ లేకపోతె చూపెట్టుకో... చెరువు నీళ్లతో పంట పండించుకో... గురుకులంలో పిల్లల్ని చదివించుకో... ఆడబిడ్డ పెళ్లి గౌరవంగా చేసుకో... ఇంకా మంచిది... ప్రభుత్వం స్కాలర్షిప్ తీసుకో... బిడ్డని విదేశాలకు పంపుతవో ఈడనే సదివిపిస్తవో... కేటీఆర్ లెక్క, కవితక్క లెక్క కష్టపడమని చెప్పు... పదిమందికి మంచి చేసే కొలువు చెయ్యమను... అప్పుడు మంచి మనసుతో పని చేసినా నిన్ను రెచ్చగొట్టినట్టే ఎవడో ఒకడు ఎవల్లనో లేపుతడు... అప్పుడు నీ బిడ్డలకి కేసీఆర్ బిడ్డల లెక్కనే ఓపికగా ఆళ్ళను సముదాయించమను... అప్పుడు నువ్వు కేసీఆర్ లెక్క కుటుంబ పెద్దగ ఖుషయితవు...

(PS: నిజానికి ఉచిత పథకాలకి నేను పెద్ద మద్దతుదారుని కాదు. విద్య, వైద్యం, తక్షణ జీవన అవసరాలకి మాత్రం అది పరిమితం కావాలని నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ బతుకమ్మ చీరల పంపకం రెగ్యులర్ పాపులిస్ట్ స్కీం కాదు. 1930 అమెరికా ఆర్థిక సంక్షోభ సమయంలో John Maynard Keynes అనే ఆర్థికవేత్త infrastructure అభివృద్ధిలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలని symbolicగా ‘Dig the holes and fill them’ అని ప్రతిపాదిస్తాడు. సుమారు అదే తరహాలో, అంతకంటే విస్తృత సామాజిక ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి, పవర్ లూం రంగానికి కొత్త ఊపును ఇవ్వడానికి వారికి ఏడాది పొడుగునా పని ఉండేలా చూసేందుకు బతుకమ్మ చీరలను ఇవ్వాలని సంకల్పించింది. ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న కార్యక్రమంలో అక్కడక్కడా కొన్ని లోపాలు ఉండడం సహజం. వాటిని తమ దృష్టికి తెస్తే సవరించుకుంటామని ప్రభుత్వం చెబుతున్నది. అయినా కొంతమంది క్షణికావేశంలో చేసిన అసంబద్ధ వాదనలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఎదో జరిగిపోయిందనో, జరగాలనో అగమాగం అవుతున్నారు కొందరు. తెలంగాణకు కేసీఆర్ అవసరం ఎంత ఉందో చెప్పటానికి సాపేక్షవాదనలు అవసరం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీల చర్యలతో ఆయనకు ప్రత్యామ్నాయం దరిదాపుల్లో లేదని మాత్రం మళ్ళీ మళ్ళీ రుజువవుతున్నది. కేసీఆర్ గారి పథకాలను విమర్శించడం, సలహాలివ్వడం దూరం ముచ్చట... ఆయన చేసే పనుల లోతూ, విస్తృతి వీళ్ళకు అర్థమైతే గూడ గొప్ప విషయమే...! )

 

(సోషల్ మీడియా నుంచి సేకరించినది)

click me!