చంద్రబాబు, జగన్ ల పులివెందుల రాజకీయాలు

 
Published : Dec 28, 2016, 04:06 AM ISTUpdated : Mar 28, 2018, 04:58 PM IST
చంద్రబాబు, జగన్ ల పులివెందుల రాజకీయాలు

సారాంశం

 

‘సంక్రాంతి పర్వదినం సందర్బంగా పులివెందులకు నీరు విడుదల చేస్తున్నాము వై యస్ కుటుంబం చేయని పనిని తాము చేస్తున్నాం’  అంటూ అధికారపార్టీ నేతలు ప్రకటన ఒకవైపు,  పులివెందులకు నీటిని విడుదల చేయాలంటూ ప్రతిపక్ష నేత జగన్ పోరాటం  (సోమవారం నాటి దర్నా) మరో వైపు . రాయలసీమలో ఒక మూల జరుగుతున్నరాజకీయమిది.

 

పులివెందులకు మేం న్యాయం చేశాము అంటే మేం  చేశాము అంటూ మాటల యుద్దాలు ప్రారంభించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామంటూ ప్రతినెల  చేస్తున్నా ప్రకటనలే మళ్లీ చేస్తున్నారు.

 

 మరో వైపు రాయలసీమకు అన్యాయం జరుగుతున్నదని తమకు నికర జలాలే కావాలని సీమ రైతులు ఎప్పటిలాగే తమనిరసన గలం వినిపిస్తూనే ఉన్నారు.  గండికోట కేంద్రంగా సీమ ప్రజలను మరచి అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న పులివెందల రాజకీయాలేమిటో పరిశీలిద్దాం.

 

పులివెందుల రాయలసీమలో ఒక బాగం.

 

సీమ నీటి సమస్య పరిష్కారించడం ద్వారానే పులివెందుల నీటి సమస్యా పరిష్కరించబడుతుంది. నాలుగు సీమ జిల్లాలకు త్రాగు, సాగు నీటి సమస్యకు పరిష్కారం హెచ్ యల్ సీ,  యల్ యల్ సీ ప్రాజక్టులు కాకుండా గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగా, యస్ ఆర్ బీసీ ప్రాజెక్టుల ద్వారా సాధ్యం. ఈ ప్రాజక్టులు పూర్దికావడంతో బాటూ వాటికి నికర జలాలు కేటాయించడం, శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కనీస నీటిమట్టం ఉండేలా చూడటం అందుకు ఆటంకంగా ఉన్న జీఓ నె 69 ని రద్దు చేయడం దీనికి అవసరం.

 

సిద్దేశ్వరం, గుండ్రేవుల, సమాంతర కాలవ నిర్మాణం వెంటనే చేపట్టడం లాంటి నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవడం ద్వారానే రాయలసీమకు, అందులో బాగంగా పులివెందుల, కుప్పం కు నీరు ఇవ్వడం సాద్యం అవుతుంది. కాని మన అధికార ప్రతిపక్ష పార్టీలు మాత్రం వీటి జోలికి వెల్లకుండా సీమ నీటి సమస్యను పరిష్కరిస్తున్నట్లు  చూపిస్తున్నాయి.  తాత్కాలిక ప్రయోజన చర్యలు చేపడుతూ తమ రాజకీయ ప్రయోజనాల కాపాడుకుంటున్నాయి.

 

గండికోట రాజకీయం...

 

గండికోట ద్వారా పులివెందలకు నీటిని ఇస్తాన్నామని అధికార పార్టీ, ఇవ్వడం లేదని ప్రతిపక్షం  బజారుకెక్కాయి.

 

అసలు విషయం ఏమిటో తెలుసా.

 

సీమకు నీరు అంధించే నాలుగు ప్రాజెక్టులలో ఒకటి గాలేరు-నగరి. కడప, చిత్తూరు జిల్లాలకు నీరు అందించే ప్రధాన కాలవ. స్వర్గీయ రామారావు గారు దీనికి శంఖస్దాపన చేసినా,  తర్వాత,  ప్రస్తుత ముఖ్యమంత్రి బాబుగారి దాకా  ఎవరూ పట్టించుకోలేదు. 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్ కాలంలో ఈ ప్రాజెక్టు పనులకు మోక్షం కలిగిన మాట వాస్తవం.

 

రాయలసీమలోని అన్ని జిల్లాల నీటకి మూలం పోతిరెడ్డిపాడు అయినట్లే పులివెందులకు కూడా అదే మూలం. పోతిరెడ్డిపాడు రేగ్యూలేటర్ నుంచి యస్ ఆర్ బీసీ, గాలేరు నగరి, తెలుగుగంగా, కుందూ ద్వారా కేసీ కెనాల్ కు నీరు అందుతుంది. ఇప్పుడు చర్చకు మూలం అయిన పులివెందులకు కూడా గాలేరు-నగరి ద్వారానే నీరు అందివ్వాలి.  పోతిరెడ్డిపాడు ద్వారా పాములపాడు, బనకచర్ల, గడివాముల, గోరకల్లు, పాణ్యం, బనగానపల్లి, అవుకు, మైలవరం ద్వారా గండికోటకు నీరు వస్తుంది.

 

గండికోటకు శంఖుస్దాపన చేసిన బాబుగారు దాని నిర్మాణానికి ఒక్క రూపాయికూడా కేటాయించలేదు. వై యస్ ముఖ్యమంత్రి అయిన వెంటనే గండికోటను పూర్తి చేసినారు. గండికోటకు కడప జిల్లా ప్రజల  అబిమానాన్ని చూరగొన్న ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టారు. ఈ ప్రాజెక్టులో 4 టిఎంసి చేరితేనే లిప్ట్ చేయడం సాధ్యమౌతుంది. అక్కడి నుంచి కొండాపురం, సింహద్రీ, చిత్రావతి, లింగాల, పులివెందుల మీదుగా వెంపల్లి చేరుకోవడం ద్వారా కడప జిల్లాలో గాలేరు నగరి లక్ష్యం నెవేరుతుంది.

 

నిజానికి ఈ ప్రాజెక్టు కడప తర్వాత చిత్తూరు జిల్లా ప్రయోజనాలను కూడా తీర్చాలి. ఇప్పటివరకు జరిగిన పనులలో 80 శాతం వై యస్ కాలంలో జరిగినవే. గోరకల్లు, అవుకు, మైలవరం, గండికోట, చిత్రావతి లాంటి రిజర్వాయర్ లను వైయస్ పూర్తి చేసినారు. కాలవల నిర్మాణం మాత్రమే కొంత మిగిలింది.

 

అయినా కడపకు నీరు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఇంతకు ముందే ప్రస్తావించినట్లు నీరు రావాల్సింది పోతిరెడ్డిపాడు నుంచి. కాకపోతే రెండు సమస్యల ఇబ్బందిగా ఉంది. 1 పోతిరెడ్డిపాడు సామర్ద్యం రోజుకు 11 వేల క్యూసేక్యులు. 2 ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆదారపడిన ప్రాజెక్టు శ్రీశైలంలో 854 అడుగులు నీరు ఉంటేనే పనిచేస్తుంది.

 

1996 లో చంద్రబాబు గారు క్రిష్ణా డెల్టాప్రయోజనాల కోసం కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు నిర్ణయించారు. ఫలితంగా సీమకు నీరు అందే పరిస్దితిలేదు. వైయస్ అధికారంలోకి రాగానే ఈ రెండు సమస్యలపై శ్రద్ద పెట్టారు. పోతిరెడ్డిపాడు సామర్ద్యంను రోజుకు 44 క్యూసేక్యులకు పెంచారు. పలితంగా రోజుకు అంతకు ముందు 1 TMC  మాత్రమే నీరు వచ్చేపరిస్దితినుంచి 4 TMC లకు పెరిగింది. అలా వస్తేనే నీటిని సీమ ప్రాజెక్టులకు  అందించే అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ ప్రాజెక్టులకు నికర జలాలు లేవు కనుక వరదులు వచ్చినపుడు వీలైనన్ని నీరు తీసుకోవాలన్నా ఈ పెంపు కీలకం. అంతేకాక శ్రీశైలం కనీస మట్టం 834 నుంచి పోతిరెడ్డిపాడు పనిచేయడానికి వీలుగా 854 కు పెంచారు. ఆ రెండు నిర్ణయాలను వైయస్ చేసినపుడు స్వంత పార్టీనేతలతో బాటు అన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

 

ముఖ్యంగా నేటి నీటిపారుదల మంత్రి దేవినేని ప్రకాశం బ్యారేజి దగ్గర ఆందోళన చేసి వైయస్ ఏపికి ముఖ్యమంత్రిగా కాకుండా సీమకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్సించారు. ఆ సందర్బంలో బాబుగారు మౌనం వహించారు.

 

 తీవ్రవత్తిడి ఫలితంగా వైయస్ కేవలం పోతిరెడ్డి పాడు సామర్ద్యంను పెంచినా శ్రీశైలం నీటిమట్టం విషయంలో అనుకున్నది చేయలేకపోయారు. నేటికి ఆ సమస్య సీమ పాలిట శాపంగానే ఉంది. వైయస్ నాడు పోతిరెడ్డిపాడు సామర్ద్యం పెంచిన కారణంగానే నేడు సీమ ప్రాజెక్టులకు ప్రతికూల పరిస్దితులలోకూడా నీటిని కొంతమేరకైనా అందివ్వగలుగుతున్నాము. ఇప్పుడు బాబుగారు రాయలసీమలో రైతులు, నవతరం ఆందోళన ఫలితంగా సీమకు నీరు ఇవ్వకుండా మనుగడ సాధ్యంకాదని నిర్ణయానికి వచ్చిన కారణంగానే అరాకొర ఇచ్చేప్రయత్నం చేస్తున్నారు.

 

గతంలో వైయస్ 80 శాతం పూర్ది చేసిన ప్రాజెక్టులలో మిగిలిన భాగం పూర్తి చేసి నీరు ఇవ్వగలిగితే సంతోషమే.

 

కాని బాబుగారు ప్రధానంగా ప్రతిపక్షనేతను రాజకీయం లక్ష్యం చేసుకొని పులివెందుల నీటి విడుదల రాజకీయం చేస్తున్నారు. మిగిలిన పనులను పూర్ది చేయడానికి క్రిష్ణాడెల్టా కోసం పట్టిసీమ నిర్మించడాని చేసిన విదంగానే గాలేరు నగరికి నిదులు కేటాయించి శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులుగా జీఓను మార్పు చేస్దే పులివెందులకే కాదు కడప, అనంత, చిత్తూరు చివరకు కర్నూలుకు కూడా నీరు ఇవ్వవచ్చు కాని అందుకు బిన్నంగా కేవలం పులివెందుల చుట్టే వ్యవహరం నడపడం మంచిదికాదు. అంటే క్రిష్ణ, గోదావరి వారికి నిర్మాణాత్మకమై చర్యలు తీసుకుంటూ( పట్టిసీమ, పురుషోత్తం పట్నం, పోలవరం వీటి వలన సీమకు చుక్కనీరు రావు) సీమకు మాత్రం తాత్కాలిక ఉపశమనం  చర్యలు చేపట్టడం ఆందోళనకరం.

 

ఇప్పుడు తీసుకున్న చర్యలు వలన చివరకు పులివెందులకు కూడా సరిపడ నీరు అందదు. కేవలం జగన్ ను విమర్సించడానికి మాత్రమే సరిపోతుంది. రేపు తెలంగాణ, కోస్తా ప్రాంతాలకు నీరు అవసరం అయినా, వర్షాలు పడకపోయినా సీమ పరిస్దితి దయనీయంగానే ఉంటుంది.

 

 

విచిత్రమేమిటంటే ఈ చర్యలను వ్యతిరేకించాల్సిన వైయస్ జగన్ కూడా చాలపరిమితమైన విషయాలనే మాట్లాడం వాంచనీయం కాదు. పులివెందుల దర్ణాలో కూడా ఆ ప్రాంతానికి నీరు ఇమ్మాన్నారే కాని దానికి ఆటంకంగా ఉన్న జీఓ నెం 69 ని రద్దుచేయమని ఒక్కమాట అనకపోవడం దారుణం. చివరకు తన తండ్రి నాడు పోతిరెడ్డిపాడు, శ్రీశైలంలో తీసుకున్న చర్యలను అడ్డుతగులుతూ వైయస్ ను రాయలసీమ వాడిగా చిత్రీకరించి సీమకు నీరు రాకుండా అడ్డుకున్నా, తనను తీవ్రంగా దూసిస్తున్న దేవినేని కూడా విమర్సించకపోవడం చూస్తుంటే వారు బాబుగారి పులివెందుల రాజకీయలను వ్యతిరేకిస్తున్నారు తప్ప రాయలసీమకు బాబుగారు చేస్తున్ననీటి అన్యాయాన్ని మాత్రం వ్యతిరేకించడానికి రాజకీయంగా ఇష్టం లేనట్లు అర్దమవుతుంది. అంటే అధికార ప్రతిపక్షాలకు పులివెందుల రాజకీయాలు తప్ప రాయలసీమకు నీటిని అందించే రాజకీయాలు ఇష్టం లేదన్నమాట.     

     

 

 

PREV
click me!

Recommended Stories

S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?