చంద్రబాబు నీళ్ల కబుర్లు... గాలి కబుర్లు

First Published May 6, 2017, 7:47 AM IST
Highlights

 

ఈ మధ్యే ఒక  యాంగ్రీయంగ్ మన్ పరిచయమయ్యాడు...వేమన టైప్...బట్టలూడదీసి కొడుతుంటాడు..మనుషుల నైజాన్ని,మతంపేరజరిగే పనులనూ.  నేను మాత్రం అంత దిసమొలతో ఉండటం పనికి రాదు, అరమీటరు పుట్టగోచీలాగైనా ఉండాలంటా...ఉన్నాయో లేవో తెలియని పాపపుణ్యాలు,పరలోకాలు,పాపభీతి మనిషిలో ఆవగింతైనా నైతికత పెంపొందిస్తుందని నా వాదన....కానీ వయసు మీద పడ్డా ఆ భావాలేమీ లేకుండా సిగ్గూ సింగారం లేని బతుకులు కొందరివి....

 

ఈ రోజు పత్రికల్లో కృష్ణా జలాల పంపిణీ గురించి వచ్చిన వార్త (ఇది ఈనాడు నుంచి)..

 

బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ముచ్చుమర్రి గురించి ఆంధ్రప్రదేశ్ వాదన అది.
రాయలసీమ తాగునీటి అవసరాలకు తప్ప కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాదు అని చెప్పారు.
 

ముందుగా రాయలసీమ కు వందలఏళ్ల నుంచి ఆధారమైన k.c.canal రెండు మాటలు:


మా కెసి కెనాల్  కు 39.5 tmc నికరజలాలున్నాయి..డచ్చి వారు కడుతూ మధ్యలో చేతులెత్తేసిన ఈ కాలువను కాటన్ దొర పూర్తిచేసాడు...ఈ నికరజలాల్లో 10tmc తుంగభద్ర డామ్ నుంచి రావాలి.ఇక మిగిలిన 29 5tmc నీళ్లకు తుంగభద్ర డామ్ దిగువన-ఈ కాలువ మొదలయ్యే సుంకేసుల బారాజ్ మధ్య కురిసిన వర్షం ఆధారం...
ఈ సుంకేసుల బరాజ్ దగ్గర తుంగభద్ర ఒక దిశలో ప్రయాణించి కృష్ణలో చేరుతుంది.కాలువ కొద్దిదూరం నదికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.

 


కూటికోసం కేరళ పోయి పొట్టపోసుకునే అభాగ్యజీవులకు,కోట్ల విలువైన కార్లను కొడుకులకు బహుమతులిచ్చే నాయకులకూ పుట్టిల్లు అనంతపురం జిల్లా...వాళ్ల తాగు,సాగు నీటి అవసరాలకు తుంగభద్ర నుంచి HLC(High Level Canal) ఉంది..అది కొన్ని వందల కిలోమీటర్లు కర్నాటకలో ప్రయాణించి రావాలి..ఇక్కడంతా తెలుగోళ్ల జలచౌర్యం....పాడైన కాలువలు..ఇక డామ్ లో పూడిక పేరుకుపోయి ఎప్పుడూ సరిగ్గానీళ్లు రావు.


అప్పుడు ఆ నాయకులు ఈ కెసి కెనాల్  మీద కన్నేసారు...ఇంకేముంది..బాబుగారు దిగిపోయే ముందు ఒక దిక్కుమాలిన GO.. GO-10 irrigation &I &CAD dated 21-01-2004 తెచ్చి నీళ్లు తీసుకుపోవడం మొదలెట్టారు..మరి ఆ నీళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ కాలువకు నీళ్లు చూపించలేదు...


సరే ఇంతా చేసినా తీవ్ర దుర్భిక్షం..తాగునీటికీ కటకట...మళ్లీ ఈ నాయకులంతా YSR ను కలిసారు...అప్పుడు మరో 5 tmc GO-3 dated 04-01-2006 ద్వారా కేటాయించి ఆ పోగొట్టుకున్న మొత్తం నీళ్లకు పరిహారంగా 2 మార్గాలు చూపారు(నిజానికి డామ్ నుంచి 10 tmc తీసుకోవాల్సిఉన్నా పూడిక వల్ల అన్ని నీళ్లివ్వరు..అక్కడి నీటి పరిమాణాన్ని లెక్కగట్టి ఒక నిష్పత్తి ప్రకారం కాలువలకు పంచుతారు..ఒక్కో ఏడది 5,6 tmc మాత్రమే ఇస్తారు).


సరే వైఎస్ ఆర్ ప్రతిపాదనల ప్రకారం వరదలున్నప్పుడు బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్  దగ్గరున్న k.c.canal escape channel నుంచి 5 tmc పారించుకొమ్మని....ఇది కెసి కెనాల్ 120వ కి.మీ నుంచి కింద ఉన్నవారికి ఉపయోగం..మరి ఆ ఎగువనున్న వారికో???


అందుకు ముచ్చుమర్రిదగ్గర మరో ఎత్తిపోతల ప్రారంభించారు...70వ కి.మీ దగ్గర నీళ్లు కృష్ణా నది నుంచి కాలువలోకి ఎత్తిపోసి reverse technology ద్వారా 70 కి.మీ నుండి 0 కి.మీ వరకు పారిస్తారు.....



ఈ ముచ్చుమర్రి నుంచి శ్రీశైలంలో 798 అడుగులవద్ద నీళ్లు తీసుకోవచ్చు..ఇక ఆ కెసి కెనాల్ అవసరాల నిమిత్తం 4 పంపుల ఏర్పాటుకు YSR అనుమతించాడు. దీనికి సమీపంలో ఉన్న మల్యాల వద్ద ప్రారంభమయ్యే హంద్రీ-నీవా కు 834 అడుగులదగ్గర నీళు తీసుకోవలసి ఉంటుంది. పూర్తి ఇబ్బంది పరిస్థితుల్లో కర్నూల్ జిల్లా పడమర ప్రాంతాలకు,అనంతపురం,చిత్తూరు జిల్లాకు నీళ్ళందించాలని ముచ్చుమర్రిలో 12 పంపులు ఏర్పాటు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి అనుమతులిచ్చి పనులు ప్రారంభించారు. అయితే బ్లాస్టింగ్ పనులు విపరీతంగా జరుగుతున్నందున ఆ గ్రామ ప్రజలు కోర్ట్ కు వెళ్లారు..ఆ తీర్పులొచ్చి మొన్న 2 నెలల క్రితం 2 పంపులుకెసి కెనాల్ కు వదలడానికి సిద్ధమయ్యాయి...

 




ఇక, ‘చూస్కో, నా సామిరంగా’ అంటూ బాబుగారు ఇదేదో రాయలసీమకు జీవనాడి. లక్షల ఎకరాలు సాగవుతాయని డబ్బా...దివాకర్ రెడ్డి వెకిలి మాటలు. స్థానిక శాసన సభ్యుడు ఐజయ్య  బాబు ను నిలదీసిన విషయం తెలిసిందే...ఇక ఆపం గాళ్లు 5 టీయంసీలకే సీమ లక్షల ఎకరాలు పండబోతున్నాయని వ్యాసాలు రాసిపడేసారు..

ఆ తర్వాత వెంటనే పంపులు ఆపేసారు..రైతులు ఇలా నిరసన తెలియజేసారు...


ఇక హంద్రీ-నీవా కు ఉద్దేశించిన పనులు నత్తతో పోటీపడి సా...గు తున్నాయి...


అసలు భారీ వరద ఉండి ఆ ట్రైల్ రన్ వేసారు కానీ ఆ పంపులవద్దకు నీళ్లు తెచ్చే అప్రోచ్ కెనాల్ ఇంకా పూర్తి కాలేదు..ఇంకా కొన్ని వందల మీటర్లు తవ్వాల్సి ఉండగా తవ్విన దానిలో అడ్డంగా ఉన్న మట్టి కట్టనే తొలగించలేదు(ఫోటోలో చూడవచ్చు)


ఇక ఇక్కడ 798 అడుగుల నుంచి ఎత్తిపోసే నీళ్లు హంద్రా-నీవా పంపులవైపు చేర్చే కాలువ పనీ పూర్తి కాలేదు.


కానీ ముచ్చుమర్రి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఒక కొత్త కాలువ 35 కి.మీ తవ్వించి పోతిరెడ్డిపాడులో కలుపుతా అని మొన్నటి వార్త.
 

అసలు ఇప్పటికే బాబు తెచ్చిన go-69 వల్ల కనీస నీటిమట్టం తగ్గి అగచాట్లు పడుతున్నాం...రేపోమాపో టెలిమెట్రి యంత్రాలు అమర్చబోతున్నారు...ప్రజల సమస్యలు గాలికొదిలి గాలికబుర్లు చెప్పుకుంటూ,దోచుకుంటూ తిరుగుతున్నారు....


దున్నపోతు మీద వాన అనాలో,తినమరిగిన కోడి వరిమళ్ల దావ అనాలో....


మా సీమ భాషలో సిగ్గూసింగారం లేని బతుకులు అనాలో!!!!!

 

click me!