“చేతి వేలి ముద్రతోనే ఇకపై భవిష్యత్తు నడుస్తుందనీ - కేవలం మీ చేతి వేలి ముద్ర తోనే నగదు రహిత లావాదేవీలు జరపవచ్చుననీ - ఇకపై అన్నీ రకాల లావాదేవీలూ నగదు రహితంగానే చేయాలనీ, దానికోసం మొబైల్ కానీ, ఇంటర్నెట్ కానీ అవసరం లేకుండానే కేవలం వేలి ముద్ర ఆధారంగానే లావాదేవీలు చేయవచ్చుననీ నిన్నటి రోజున మన ప్రధాని "నరేంద్ర మోడీ" గారు ఘనంగా ప్రకటించారు.”
undefined
మరో 20 రోజుల్లో ఇంటర్నెట్ కాదుకదా, కనీసం మామూలు మొబైల్ ఫోన్ అవసరం కూడా లేకుండానే, కేవలం వేలి ముద్రలతోనే నగదు బదిలీ జరిగే విధంగా రూపొందించనున్నామని మోడీ తెలిపారు.. అదెలాగంటే, వ్యాపారులు, దుకాణాదారులు ఒక "బయోమెట్రిక్ రీడర్" పరికరాన్ని సుమారు 2వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుడు లావాదేవీ చేసేటప్పుడు ఈ పరికరం పై తన వేలి ముద్రను ఉంచితే, తన బ్యాంక్ అక్కౌంట్ నుండి, వినియోగదారుడి అక్కౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి.
దీనికోసం వినియోగదారుడు తన ఆధార్ నంబర్ ను బ్యాంక్ అక్కౌంట్ కు తప్పకుండా అనుసంధానించుకోవాలి. అంటే, ఈ వ్యవహారమంతా ఆధార్ కార్డ్ డాటాబేస్ లో ఉన్న మన వేలిముద్రల ద్వారా జరుగుతుందన్నమాట! ( దేశంలో ఉన్న కోట్లాదిమంది వ్యాపారస్తులు ఒక్కొక్కరు 2 వేలు పెట్టి ఈ డివైస్ కొంటే, ఆ మెషీన్ ఉత్పత్తి చేసే కంపనీకి ఇక కాసుల పంటే మరి.!! ఎవరో ఆ పుణ్యాత్ముడు .
వినడానికి చాలా సింపుల్ గా - ఆసక్తికరంగా ఉంది కదూ ??? ఎందుకుండదూ ?? "కొత్త ఒక వింత" అని పెద్దలెప్పుడో సెలవిచ్చారు మరి.
ఇకపోతే, ఇది ఎంతవరకూ సురక్షితం ?? దీనివల్ల కలగబోయే దుష్పరిణామాల తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది ?? ఓసారి చూద్దామా ?.
అసలు "ఆధార్" ను యూపిఏ ప్రభుత్వం మొదలుపెట్టగానే, బిజేపి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. కోట్లాది భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని (వేలి ముద్రలు, కంటి పాపల వివరాలు తదితరాలు) గంపగుత్తగా విదేశీ సంస్థలకు అమ్మేస్తున్నారనీ(?) , భారీ స్థాయిలో సేకరించిన సున్నితమైన ఈ సమాచారాన్ని కాపాడుకోవడం తలకుమించిన భారమనీ నానా అలజడి సృష్టించారు.
మరిప్పుడు ఈ బిజేపి వాళ్ళు చేస్తున్నదేమిటి ???
"కేవలం వేలి ముద్రను స్కాన్ చేయడం ద్వారా" తన ఆధార్ అనుసంధానిత బ్యాంక్ అక్కౌంట్ లో ఉన్న డబ్బులు వ్యాపారస్తుడికి చేరిపోతే, మరి ఇంత సులభంగా ఉన్న ఈ విధానాన్ని దుర్వినియోగం చేయడం ఎంత సులువో ఆలోచించండి. !! ప్రస్తుతం ఏదైనా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తో పే చేయాలంటే షాపులో స్వైప్ చేశాక పిన్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా ఇబ్బంది ఉంది, ఎవరైనా కార్డు ఉన్నవాళ్లని బెదిరించి బలవంతంగా పిన్ ఎంటర్ చేయమని చెప్పి వాడుకొన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
ఇక ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఏదైనా కొనుగోలు చేయాలంటే అది చాలా సెక్యూర్ పద్ధతిలో సాగుతుంది. మనం కార్డ్ నంబర్, కార్డ్ ఎక్స్పైరీ డేట్, సివివి నంబర్ ఇచ్చాక కూడా ఒక ఓటిపి (ఒన్ టైమ్ పాస్వర్డ్) మన మొబైల్ నంబర్ కు వస్తుంది.. దాన్ని ఎంటర్ చేశాకనే లావాదేవీ పూర్తవుతుంది. ఇది చాలా సురక్షితం.
ఇవన్నీ లేకుండా, కేవలం వేలిముద్రను షాప్ లో ఉన్న మెషీన్ కు ఆనిస్తే, అక్కౌంట్ లో ఉన్న డబ్బులు బదిలీ అయ్యే ఈ సింపుల్ వ్యవహారాన్ని, మోసగాళ్ళు చాలా సులువుగా దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతకుమించి, వినియోగదారులకు సంబంధించిన రహస్య సమాచారం వేలి ముద్ర - ఆధార్ లాంటివి యాప్ సర్వర్ లలోనూ - కార్డ్ రీడర్ డివైస్లలోనూ స్టోర్ కావడం ఎంతవరకూ సురక్షితం ?? ఇది జనాల వ్యక్తిగత సమాచారానికి ప్రైవసీ లేకుండా చేయడం కాదా ??
సినిమాల్లో చూపించినట్లు, మనిషిని స్పృహ లేకుండా చేసి, వారి వేలిని కార్డ్ రీడర్ పై స్వైప్ చేసి అవలీలగా బ్యాంక్లో ఉన్న డబ్బులను ఏదో ఒక లావాదేవీ రూపంలో మరలించుకొనే అవకాశం ఉంది. అంతే కాకుండా, లెక్కలేనంతగా ఉన్న పేదల అక్కౌంట్ లను కూడా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అదెలాగంటే.
దుర్వినియోగం చేయాలనుకొంటున్న ఒక వ్యక్తి గానీ - ఒక గుంపు గానీ, వారికి పరిచయమున్న ఒక వ్యక్తికి ఎంతో కొంత ముట్టజెబుతామని చెప్పి, ఆ అక్కౌంట్ లోనికి వేరే వ్యక్తియొక్క డబ్బులు వేసి, అక్కౌంట్ హోల్డర్ గా ఉన్న ఈ వ్యక్తిని వచ్చి వేలిముద్రను వేయమని చెప్పి అసలు లావాదేవీలు చేస్తున్న వ్యక్తుల వివరాలు ఏమాత్రమూ తెలియనీయకుండానే, మరొక వ్యక్తి పేరుతో లావాదేవీ జరిగిపోతుంది. ఆ వేలిముద్ర వేసిన అభాగ్యుడికి, తన అక్కౌంట్ తో ఇంత మోసం జరిగిపోతుందని బహుశా తెలియదేమో.!
మోడీ గారు చెప్పినట్లు, "కేవలం వేలి ముద్ర చాలు, లావాదేవీలు చేయడానికి" అన్నమాట గనక నిజమైతే, అది అత్యంత ప్రమాదకరమైనదిగా పరిణమించే ప్రమాదముంది. !!
ఏమో..!! కాలమే సమాధానం చెబుతుంది..!