ఇద్దరు ప్రధానుల అసమర్థత , అసహాయత

 |  First Published Dec 12, 2016, 2:47 AM IST

 

ప్రతిపక్షాలు నన్ను పార్లమెంటులో మాట్లాడనీయటం లేదు, అందుకే జన సభల్లో మాట్లాడుతున్నాను అన్న మోడి మాటల్లొ ఆయన అసహాయత, పార్లమెంటును నడపటంలో అధికార పార్టి అసమర్ధత తెలుస్తుంది.

Latest Videos

undefined

 

30 సంవత్సరాల తరువాత పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బిజెపి-ఎన్ డిఎ  ,542 సభ్యులుగల లోక్ సభలో మొత్తం 332 మంది(బిజెపి సొంత బలం 282) సమావేశాలను నడపలేక పోవటం,ప్రతిపక్షాలు మమ్మల్ని అడ్డుకుంటున్నాయి అనటం విడ్డురం.సాధారణంగా అధికార పక్షం మంద బలంతో మాగొంతు నొక్కుతుందని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కాని ఇక్కడ సీన్ రివర్స్.

నోట్ల రద్దును ప్రకటించిన 8-నవంబర్-2016 నుంచి ప్రధాని ఎన్నిసార్లు సభకు హాజరయ్యారు?పట్టుమని 2 సార్లన్న సభకు వెళ్ళారా?గోవా,పంజాబ్,ఉత్తర ప్రదేశ  ఎనికల సభలలో ప్రచారం చేసుకుంటున్నారా?

 

ఈ సంధర్భంగా ప్రధాని హోదాలో పార్లమెంటుకు ఒక్కసారి కూడ హాజరు కాని "చరణ సింగ్" ఉదంతం గుర్తొస్తుంది.1977 ఎన్నికలలో సూపర్ మెజారిటి 345 సీట్లు గెలిచిన "జనతా" పార్టి మొరార్జిదేశాయ్ ప్రభుత్వం 26 నెలలు తిరగక ముందే జనతాలో విలీనమైన అనేకపక్షాల గోడవలతో కూలిపోయింది.ఉప ప్రధానిగా వున్న "భారతీయ్ లోక్ దళ్ " నేత చరణ్ సింగ్ 64 మంది సభ్యులతో జనతా నుంచి బయటకు వచ్చి కాంగ్రేస్ మద్దతుతో 28-జూలై-1979న ప్రధాని అయ్యారు.

 

కాంగ్రేస్ తన మార్కు రాజకీయంతో చరణ్ సింగుకు చుక్కలు చూపించింది. చరణ్ సింగ్ తగినంత మద్దతు లేకపోవటంతో సభను జరపకుండ వాయిదా వేసుకుంటు వచ్చారు.అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి కూడ ఆయనకు సహకరించారు.చివరికి 6 నెలలొ ఒక్కసారన్న సభను జరపాలన్న రాజ్యాంగ నియమంతో పార్లమెంటును హాజరుపర్చక తప్పని పరిస్థితులలొ పదవి స్వీకారం చేసిన 170 రోజులు తరువాత 14-జనవరి-1980న చరణ్ సింగ్ రాజినామ చేశారు.

 

ఆవిధంగా చరణ్ సింగ్ ప్రధాని పదవిలో వుండగా ఒక్కసారి కూడ పార్లమెంటు మెట్లెక్కని ప్రధానిగా చరిత్రకెక్కారు.

1980లో జనతా విచ్చిన్నం తరువాత అందులో బాగస్వామి అయిన పూర్వ జనసంఘ్ పేరు మార్చుకోని "భారతీయ జనతా పార్టి"గా అవతరించింది. చరిత్రలో మొట్టమొదటిసారి పూర్తి మెజారిటితో ఎన్నికైన బిజెపి నేత మోడి పార్లమెంటుకు హాజరుకాకుండ కొత్త రికార్డ్ వైపు పరిగెత్తుతున్నారు.

 

పార్లమెంటు నడపటంలో ప్రభుత్వ అసమర్ధతను చివరికి బిజెపి సీనియర్ నేత అద్వాని కూడ నిందించారు.స్పీకర్ & పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ విపక్షాలంతో సమన్వయం సాదించటంలొ విఫలమయ్యారని అద్వాని అన్నారు,సభను నడపటం చేతకాకపొతే సభను నిర్వధికంగా వాయిద్ద వేయమన్నారు.

 

ప్రభుత్వ ఏకపక్ష ధోరణి,ప్రధాని సభకు రాకుండ ఎన్నికల సభలలో ఇతర రాజకీయ పార్టీలను నిందించటం,వెంకయ్య & జైట్లీనే అన్నిటికి సమాధానం చెప్పాటాన్ని విపక్షాలు నిరసిస్తున్నాయి.ప్రధాని సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి...ప్రజాసామ్య వైచిత్రం ప్రధాని సభకు రాకుండ నన్ను మాట్లాడకుండ అడ్డుకుంటున్నారని ఎన్నికల సభలలో బాధపడటం...కాలేజికి ఏందుకు వెళ్ళలేదు అంటే సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారు అన్నట్లుంది.

 

సరే 08-నవంబర్ -2016 అర్ధరాత్రి నిర్ణయంతో 500,1000 నొట్లను రద్దుచేసి 50 రోజులు మద్దతు ఇవ్వండి,నన్ను వాళ్ళు(ఎవరో?) చంపటానికి కూడ ప్రయత్నం చెయ్యవచ్చు కాని వెనక్కి తగ్గను అన్న ప్రధాని ఇప్పుడు స్వరం మార్చి నేను ఫకీరును,అన్ని వదిలివేసి తట్టబుట్ట సర్ధుకోని పోగలను,నన్ను ఎవరు ఏమిచెయ్యలేరు,50 రోజుల్లో పరిస్థితులు సర్ధుకుంటాయి అంటున్నారు.

 

అసలు నోట్ల రద్దు లక్ష్యం ఏమైందో ?ఫకీరు బయటకొచ్చాడు!కొత్తగాక్యాష్ లెస్ ఎకానమీ అంట!దప్పిక అయినప్పుడు బావిని తొవ్వమనట్లు, మేము నోట్లు రద్దుచేశాం కాబట్టి మీచావు మీరు చావండి ఎటిఎం, పేటిఎం లు వాడండి.

 

నల్లధనం బయటకు వస్తుంది.తీవ్రవాదం తగ్గుతుంది అన్న మాటలు ఈమధ్య వినిపించటం లేదు.నల్ల కుబేరులు ఎటిఎం ల ముందు నిలబడ్డారు అన్న మొడి మాటలు ఏమో కాని నల్లకుబేరులు చక్కగా కూల్ డ్రింక్ తాగిననత సులభంగా నల్ల ధనాన్ని మార్చుకుంటున్నారు. ఒక్కోక్కరి దగ్గర కొట్ల రూపాయల కొత్త 2000 రూపాయల నోట్లు దొరుకుతున్నాయి.వీటికి పరాకాష్ట మోడి చేతుల మీదుగా "Make In India"అవా ర్డు అందుకున్న "అభినవ్ వర్మ" 42 లక్షల కొత్త 2000 నొట్లను తరలిస్తూ దొరకటం.

నోట్లరద్దు మీద ప్రభుత్వం ఎంత ముందుస్తు జాగర్తలు తీసుకున్నది ఎటిఎం ముందు క్యూలలొనే కాదు రంగు వెలస్తున్న కొత్త 2000 & అనేక తప్పులు వున్న 500 నోట్లను చూస్తే తెలుస్తుంది.

 

ప్రభుత్వం చెప్పిన 15 లక్షలు,17 లక్షలు కోట్లు లెక్క ఏమైందో తెలియదు కాని గతవారానికే 12లక్షలకు పైగా పాత నొట్లు బ్యాంకులలో డిపాజిట్ అయ్యాయంట.ఈలెక్కలు చూస్తుంటే నల్లధనం పొవటంకాదు నకిలీ నొట్లు బ్యాంకులలొ డిపాజిట్ అయినట్లు అనిపిస్తుంది.

 

సొంతింటికి దిక్కులేని మహేష్ షా 13,000 కోట్ల నల్లధాన్ని ప్రకటించటాన్ని గొప్పగా ప్రచారం చేసిన ప్రభుత్వం చివరికి అతను సినిమా ఫక్కీలో లైవ్ టివి లోకి దూరి అది నాడబ్బు కాదు, కొందరు పెద్దలు నాతో ప్రకటన చేయించారని చెప్పారు.

 

హైదరాబాదులో "లక్ష్మణ్ రావ్" అనే ఒకతను 10,00 కోట్లను ఐడిఎస్  కింద ప్రకటించి పన్ను చెల్లించలేక పోవటంతో ఐటి దాడులు చెయ్యటంతో బాబా నాకు డబ్బు వస్తుందని చెప్పాడు అందుకే నల్లధనం అని ప్రకటించాను అని చెప్పారు... ఇక్కడ బాబా "ఆత్యాధ్మిక"నా లేక రాజకీయ బాబాల?ఆ లక్ష్మణ రావుకే తెలియాలి.

ముంబైలో మరో కుటుంబం 2 లక్షల కొట్ల ఆదాయాన్ని ప్రకటించటం కూడ బోగస్ అని తేలింది.ఇవి విఫలమైన ఉదంతాలు.సఫలం అయిన సంఘటనలు అంటే కుబేరుల నల్లధానాన్ని మార్చినదెందరో? ఎవరికి తెలుసు?

 

టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో 90 కోట్లు,కర్ణాటక నటుడు & మాజి మంత్రి అల్లుడి బాత్రూంలో కిలోల కొద్ది బంగారం దొరకటం తెలుపుతున్న సత్యం ఒక్కటే నోట్లరద్దుతో నల్లధనం పోలేదు, కుబేరులకు ఇసుమంత కష్టం కలగలేదు చక్కగా రాచమార్గంలొ నల్లధానాన్ని బంగారంగానో,మరో ఆస్తిగానో లేక కొత్త నోట్లగానో మార్చుకున్నారు.

 

నోట్ల రద్దుతో ఇబ్బంది పడింది "క్యూ"లలో చనిపోయిన 70 మంది ప్రజలు,12 మంది బ్యాంకు అధికారులు ,లాఠిదెబ్బల తిన్న సామాన్యుల సాక్షంగా సగటు ప్రజలే!

 

 

ఒక నాయకుడి కలకు మొత్తం వ్యవస్త బలి అయ్యింది...

 

 

click me!