చావా ... రేవా

 |  First Published Dec 11, 2016, 6:13 AM IST

పెద్ద నోట్ల రద్దు ద్వారా తాను సంచలన నిర్ణయం తీసుకున్నాని ఫలితంగా దేశ భవిష్యత్ వెలిగి పోతుందని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశం వెలిగి పోవడం అటుంచి ఈ వ్యవహరం బెడిసి కొట్టి తానే రాజకీయంగా నష్ట పోతారా అన్న అనుమానం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అర్దం అవుతుంది. 

 

Latest Videos

undefined


కరెన్సీ రద్దు మంచి చెడ్డలు ఎలా ఉన్నా నిర్ణయం మాత్రం సాహసోపేతమైనది. ఒక రకంగా మహభారత సంగ్రామంలో పద్మహ్యుహం లాంటిది. పద్మవ్యూహంలో అభిమన్యుడు విజేతగా తిరిగి వచ్చిఉంటే అతనికి తిరుగు ఉండేది కాదు. కాని అందులోంచి తిరిగిరావడంలో విఫలమై అభిమన్యుడి చరిత్ర అర్దాంతరంగా ముగిసింది. 

 


నేడు నరేంద్ర మోదీ నిర్ణయం కూడా దాదాపు అలాంటిదే.

 

నోట్ల రద్దు వ్యవహరంలో ప్రభుత్వ అంచనాలు సాదిస్దే నిస్సందేహంగా మోది చరిత్రలో నిలిచి పోతారు. ఏ మాత్రం వికటించినా మోదీ రాజకీయ జీవితం ప్రమాదంలో పడక మానదు. నల్లధనం, అవినీతి, నకిలీనోట్ల నిర్మూలనతో తానీ మహత్తర కార్యంచేపడుతున్నట్లు ప్రధాని మోదీ శెలవిచ్చారు.  పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు ప్రజలకు కొంత గడువిచ్చారు.

 


జరుగుతున్న పరిణామాలు ప్రధాని చెప్పిన ఆశయాలకు  భిన్నంగా కనిపిస్తున్నాయి. 

 


ప్రభుత్వం అవకాశం ఇచ్చిన రెండు నెలల సమయంలో ఒక్కనెలలోనే డిపాజిట్లు పూర్దిగా వచ్చినట్లు అర్దమవుతుంది. ఇంకా పాతనోట్లు జమచేస్తే కొత్త అనుమానాలకు తెరలేస్తుంది.  భారీగా బ్యాంకులకు జమకాని రద్దు అయిన పెద్ద నోట్లు స్దానంలో కొత్త నోట్లను ముద్రించడం ద్వారా లాభపడదామన్న మోదీ హ్యుహం వికటించింది.

 


లక్ష్యం నెరవేరక పోగా మరిన్ని కష్టాలు మోదీ తీసుకున్న నిర్ణయం ద్వారా దేశ ప్రజలకు రావడం తథ్యం. ఇప్పటికే బ్యాంకులలో చేరిన నోట్లు, రద్దు అయిన నోట్లు, ఇది వరకే బ్యాంకులలో ఉన్న రద్దు అయిన నోట్లు అన్నీ కలిపి దాదాపు 15.5 లక్షల కోట్లు విలువైన కొత్త నోట్లు ముద్రించాల్సి వస్తుంది.  రమారమి 1600 కోట్ల 500 రూపాయిల నోట్లు, 350 కోట్ల 2000 రూపాయిల నోట్లను ( 15 లక్షల కోట్లు) నూతనంగా ఆర్ బిఐ ముద్రించాలి. 

 


దానికి వందల కోట్లు ఖర్చు అవుతుంది. నోటు ముద్రణకు మనదేశంలో 7 రోజులు పడితే ఆ నగదును క్రింది స్దాయి బ్యాంకులకు చేర్చడానికి 2 నెలల సమయం పడుతుంది. రద్దు అయిన 500 రూపాయిల నోటును 1988లో, 1000 రూపాయిల నోటును 1999లో ముద్రణ చేశారు. ఆనాటి నుంచి ముద్రణ అయితే నేటికి 15.5 లక్షల కోట్లుకు చేరింది. 

 

ఉదాహరణకు గత వారం నాసిక్ లో 1073 కోట్లు నోట్లు ముద్రణ జరిగింది. అవి దేశంలోని వివిద బ్యాంకులకు చేరడానికి మరో 50 రోజులు పట్టవచ్చు. అలా దేశంలోని మిగిలిన 8 కేంద్రాలలో ముద్రణ జరిగే నోట్ల పరస్దితి కూడా దాదాపు అంతే 10-20 వేల కోట్లు బ్యాంకులకు చేరడానికి 2 నెలలు పడితే ఆ లెక్కన 15 లక్షల కోట్లు చేరడానికి పట్టే సమయం, వాటి ముద్రణకు అవసరం అవుతున్న ఖర్చు కలుపుకుంటే నోట్ల రద్దు ద్వారా మోదీ ప్రభుత్వం సాధించే పలితం చాలా పరిమితం, నష్టం అపారం.

 

ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి  కావడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రజలకు తీవ్రమైన కష్టం తప్పదు. దేశంలోని ఆర్దిక కార్యక్రమాలు స్తంభించి  పోతాయి. అన్ని రాష్ట్రాలకు ఆదాయం గణనీయంగా పడిపోతుంది. పలితంగా ప్రజలలో తీవ్రమైన అలజడి వస్తుంది. పోని ఇంత కష్టపడ్డా ప్రజలకు భారీగా ప్రయోజనాలు సమకూరుతాయా అంటే అదీనూలేదు.

 

ఇక మోదీ తాను తీసుకున్న నిర్ణయం రద్దు చేసుకోవడం సాధ్యం కాదు. అది మరిన్ని విషమ పలితాలకు దారితీస్తుంది. ఈలోగా దేశంలోని ప్రజల కష్టాలు పరిస్దితి ఏమిటి, ముఖ్యంగా ప్రజల నుంచి నిత్యం జరిగే ఆర్దిక లావాదేవీలు నెలల పాటు స్దంబించిపోతే జరిగే ఆర్దిక నష్టం అపారం. అందుకే ప్రధాని మోదీ పులిపై స్వారీ చేస్తున్న వ్యక్తిగా బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అబివర్ణించారు. పులిని జయించాలి లేదా   పులినోట పడాలి.  

 


ఇంతకు  మినహ మరో మార్గం లేదు. నోట్ల రద్దు కారణంగా ప్రజల కష్టాలు తొందరగా తీరడం, రద్దు కారణంగా వచ్చిన ఫలితం సాదారణ ప్రజలకు చేరడం వల్ల మాత్రమే మోదీ రాజకీయ ముందుకు సాగుతుంది. లేదంటే రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోలేక, అలా అని తక్షణ ఉపశమనం అందివ్వలేక  మోదీకి నితీశ్ చెప్పిన  పులిస్వారీ కథ వర్తించే పరిస్థితి వస్తుంది.

 


నోట్ల రద్దు పద్మహ్యుహం నుంచి విజయం సాదించి విజేతగా మోదీ  నిలుస్తారా ?  లేదా అభిమన్యుడిలాగా విఫలం చెంది రాజకీయంగా మోదీ, ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా దేశమూ  భారీ మూల్యం చెల్లించుకుంటుందా అన్నది కొద్ది నెలలలోనే తేలనుంది.    
 

click me!